ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్.. దీన్ని ఫాలో అయితే చర్మం యవ్వనంగా మారుతుంది..!

మారుతున్న కాలంతో పాటు స్మిన్ కేర్ ప్రపంచంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుట్లో అమ్మాయిలు చర్మానికి  కేవలం క్రీములు లేదా లోషన్లకే పరిమితం కాకుండా, చర్మాన్ని చాలా డీప్ గా హెల్తీగా ఉంచే మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే స్కిన్ కేర్ ప్రపంచంలో ఒక కొత్త మార్గం పుట్టుకొచ్చింది. అదే ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్..  ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న స్కిన్ కేర్ మార్గం ఇది.  ముఖ్యంగా కొరియన్ బ్యూటీ రొటీన్‌లో దీనికి ముఖ్యమైన స్థానం ఉంది.  ఇక భారతీయ మహిళలు కూడా దీని వైపు చాలా ఆకర్షితులవుతున్నారు. అసలు ఈ ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్ అంటే ఏంటి?  దీని గురించి తెలుసుకుంటే..

ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్..

నేచురల్ గా అందం పొందాలనుకునేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చర్మ సంరక్షణ ప్రక్రియలో ఉపయోగించే పదార్థాలు  కిణ్వ ప్రక్రియకు గురవుతాయి, అంటే అవి కిణ్వ ప్రక్రియ ద్వారా చర్య జరగడం వల్ల చర్మానికి మరింత ప్రబావితంగా పనిచేస్తాయి.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ పెర్మెంటెడ్ స్కిన్ కేర్ లో సహజ పదార్థాలు బ్యాక్టీరియా, ఈస్ట్ లేదా ఎంజైమ్‌ల సహాయంతో విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియ తర్వాత ఈ మూలకాలు చర్మాన్ని మరింత సులభంగా డీప్ గా ఆరోగ్యంగా ఉంచుతాయి.   చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయుర్వేదంలో కూడా కిణ్వ ప్రక్రియ ఉత్పత్తులు చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇది చాలా ప్రభావంగా పనిచేస్తుందని చెబుతారు.

ఉపయోగించే పదార్థాలు..

ఫెర్మెంటెడ్ స్కిన్ కేర్ లో  వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో పులియబెట్టిన బియ్యం నీరు, పులియబెట్టిన గ్రీన్ టీ, పులియబెట్టిన సోయా, గెలాక్టోమైసెస్ ఉంటాయి. చాలా మంది వీటిని ఉపయోగించడం ద్వారా ఫెర్మెంటెడ్  చర్మ సంరక్షణను ఫాలో అవుతుంటారు.

ప్రయోజనాలేంటంటే..

 చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది
 చర్మం  స్థితిస్థాపకతను పెంచుతుంది
చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది

ఎవరు వాడవచ్చు?

 ఫెర్మెంటేటెడ్ స్కిన్ కేర్లో ఉపయోగించే పదార్థాలు ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలిగించవు. కాబట్టి  ప్రతి ఒక్కరూ ఫెర్మెంటేటెడ్ స్కిన్ కేర్ రొటీన్‌ను ప్రయత్నించవచ్చు. అయితే  ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది, తద్వారా అలెర్జీ వచ్చే అవకాశం ఉండదు.

                            *రూపశ్రీ.