సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకునే సింపుల్ టిప్స్ ఇవే..!!

నేచురల్ గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం అందాన్ని పెంచుకోవాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు నేచురల్ ఫేస్ ప్యాక్స్ వాడటం అలవాటు చేసుకోవాలి.

చాలామందికి నలుగురిలో తామే స్మార్ట్ గా, అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. తాత్కాలికంగా ముఖ అందాన్ని పెంచినప్పటికీ...సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్ ఎలిమెంట్స్ ఒక్కసారి ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. దీని తర్వాత మళ్లీ అందం మసకబారుతుంది! కాబట్టి అనవసరమైన కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం, డబ్బు ఖర్చుపెట్టి ముఖ సౌందర్యాన్ని పాడుచేసుకోవడం కాకుండా కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను వాడితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తులేంటో నేటి కథనంలో చూద్దాం...

పండిన అరటి:


సాధారణంగా, అరటిపండు ఎక్కువగా పండినట్లయితే, గుజ్జు మెత్తగా మారుతుంది. అలాంటప్పుడు వాటిని తినాలని అనిపించదు. దానిని చెత్తబుట్టలో పడేస్తుంటాము. అయితే ఇకపై అలా చేయకండి, ఈ పండును పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చిన్న వయసులో కనిపించే వృద్ధాప్య లక్షణాలు క్రమంగా మాయమవుతాయి.

- ముందుగా, బాగా పండిన అరటిపండును తీసుకుని.. పేస్ట్‌లా చేసుకోవాలి.
-ఇందులో అర టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు కలపాలి.
-ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగంలో మందంగా అప్లై చేసి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

పాలు :


పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా పాలు, దాని ఉత్పత్తుల పేరు ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి. పూర్వ మహారాణులు  తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పాలతో చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ తో స్నానం చేసేవారని పురాణాలు కూడా చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది, ముఖం యొక్క అందం, కాంతిని పెంచుతుంది

- కొంచం కుంకుమపువ్వును పాలలో కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. దాదాపు అరగంట తర్వాత స్నానం చేయాలి.
- రెండు టేబుల్‌స్పూన్‌ల క్రీమ్‌లో అర టీస్పూన్ పసుపు, ఒక చిన్న చెంచా శనగ పిండి వేసి బాగా కలపాలి.
-ఆ తర్వాత వేళ్ల సహాయంతో ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఐదునిమిషాలపాటు ఉంచి నీళ్లతో కడిగేయాలి.

కలబంద:


సహజంగా లభించే ఈ కలబంద గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఉన్నాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చిన్న వయసులో కనిపించే ముసలితనం సంకేతాలు, చర్మంపై దద్దుర్లు మొదలైనవి చాలా త్వరగా తొలగిపోతాయి.

-ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్
-తేనె సగం టీస్పూన్
-గట్టి పెరుగు అర టీస్పూన్
-ఒక చిన్న టీస్పూన్ రోజ్ వాటర్

పైన పేర్కొన్న మిశ్రమాలన్ని  ఒక గిన్నెలో వేసి బాగా కలపండి, మందపాటి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు వేళ్ల సహాయంతో, ఈ పేస్ట్‌ను ముఖంపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి.  పావుగంటపాటు పేస్టును ముఖంపై ఉంచి..గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి.  

పసుపు:


 పసుపును పొగబెట్టినా తక్కువే. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అందానికి ఈ పసుపుతో మంచి సంబంధం ఉంది.  ఈ రోజుల్లో పెద్ద బ్రాండ్ బ్యూటీ కంపెనీలు కూడా తమ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో పసుపుపై ఆధారపడుతున్నాయి.


ఒక గిన్నెలో అర చెంచా పసుపు పొడి, ఒక టీ చెంచా నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి.
వేళ్ల సహాయంతో వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. పదిహేను నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గడమే కాకుండా ముఖ సౌందర్యం కాంతివంతంగా మారుతుంది.