'సీతే రాముడి కట్నం' న్యూ సీరియల్ త్వరలో జీ తెలుగులో
on Sep 3, 2023
జీ తెలుగులో మరో కొత్త సీరియల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. "సీతే రాముడి కట్నం" అనే పేరుతో ఈ రీమేక్ సీరియల్ వస్తోంది. తమిళ్ సీరియల్ "సీతా రామన్" ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో సమీర్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ్ యాక్టర్ ఐన సమీర్ ఫస్ట్ టైం తెలుగు బుల్లితెర మీద ఈ సీరియల్ ద్వారా కనిపించబోతున్నాడు. తమిళ్ లో "సిల్లును ఒరు కాదల్" అనే సీరియల్ లో నటించాడు. ఇక "సీతే రాముడి కట్నం" అనే సీరియల్ లో వైష్ణవి నటిస్తోంది. ఈమె కన్నడ నటి. "మిధున రాశి" అనే కన్నడ సీరియల్ ద్వారా డెబ్యూ చేశారు. ప్రస్తుతం "ఉప్పెన" సీరియల్ మలయాళ వెర్షన్ లో జనని అనే పాత్రలో నటిస్తోంది.
ఇంకా ఈ సీరియల్ లో డాక్టర్ బాబు రియల్ వైఫ్ మంజుల పరిటాల లీడ్ రోల్ లో కనిపించబోతోంది. ఈమె తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఆమె "ఒంటరి గులాబీ" అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో వైష్ణవికి అత్తగారి రోల్ లో మంచి రెబెల్ గా నటించింది. కొత్తగా వచ్చిన పెళ్లికూతురిని గుమ్మంలోంచి బయటికి పంపించేసి ఒక సీరియస్ రోల్ లో మంజుల నటన చాలా బాగుంది. ఇంకా ఈ సీరియల్ లో వాసు ఇంటూరి వైష్ణవికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఈయన "అమృతం , ఆ ఒక్కటి అడక్కు" వంటి కామెడీ సీరియల్స్ లో నటించారు. ఇందులో వాసుకి భార్యగా వైష్ణవికి తల్లిగా శిరీషా కనిపిస్తున్నారు. "పద్మవ్యూహం, ఎండమావులు, నాతి చరామి , మౌనరాగం, మౌన పోరాటం" వంటి సీరియల్స్ లో నటించారు. అలాగే ఉప్పెన, హిట్లర్ గారి పెళ్ళాం వంటి సీరియల్స్ లో నటించిన మధు కృష్ణ కూడా ఈ సీరియల్ లో కనిపిస్తున్నారు. అలాగే రితిక, చిదం శ్రీనివాస్, బొడ్డు ప్రభాకర్ నటిస్తున్నారు. ఇక ఒంటరి గులాబీలో నటించిన పూజ ఈ సీరియల్ లో వైష్ణవికి అక్క రోల్ లో కనిపించబోతోంది.
Also Read