జీ తెలుగు అవార్డ్స్ ఎవరెవరికి ఏ క్యాటగిరిలో
on Nov 7, 2023
జీ తెలుగు అవార్డ్స్ కార్యక్రమం ఈ వారం మంచి ఫన్నీగా, మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో సాగింది. ఇక సెలబ్రిటీస్ వచ్చి విన్నర్స్ కి అవార్డ్స్ ని అనౌన్స్ చేసారు. నిండు నూరేళ్ళ సేవా సీరియల్ లో నటనకు గాను అరుంధతి- అమరేంద్రకు తరుణ్ భాస్కర్ అవార్డ్స్ ని అందించారు. ఉత్తమ అక్కాచెల్లెళ్లు కేటగిరీలో శుభస్య శీగ్రమ్ సీరియల్ నుంచి విష్ణు, కృష్ణ, హరి, శివ వీరంతా కలిసి కలర్ ఫోటో హీరో సుహాస్ చేతుల మీద జీ కుటుంబం అవార్డుని అందుకున్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ- కావ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ వచ్చి సాయంత్రం పూట నాలుగున్నరేళ్లుగా ప్రసారమవుతున్న లాంగ్ రన్నింగ్ షోగా ఉన్న రాధమ్మ కూతురు సీరియల్ కి ఈ అవార్డు ని అందించారు. మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే బెస్ట్ రన్నింగ్ లాంగ్ ఫిక్షన్ షోగా ప్రసారమవుతున్న గుండమ్మ కథ సీరియల్ కి అవార్డు అందించారు పడమటి సంధ్య రాగం సీరియల్ లో రఘురాంగా నటిస్తున్న సాయికిరణ్. ఉత్తమ భార్య క్యాటగిరిలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ యాక్టర్ భాగ్యలక్ష్మి , ఊహలు గుసగుసలాడే సీరియల్ లీని వసుందరకి అవార్డ్స్ అందించారు సర్ మూవీ హీరోయిన్ సంయుక్తా మీనన్. ఉత్తమ తండ్రి క్యాటగిరిలో అమ్మాయిగారు సీరియల్ నుంచి సూర్యప్రతాప్ కి ఈ అవార్డుని అందించారు సంయుక్తా మీనన్.
ప్రైమ్ టైంలో ఉత్తమ తల్లి క్యాటగిరిలో పడమటి సంధ్య రాగం సీరియల్ నుంచి జానకికి అవార్డు అందించారు సంయుక్తా మీనన్. నాన్ ప్రైమ్ టైంలో ఉత్తమ తల్లి క్యాటగిరిలో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో నటించిన యశోదకి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ భర్త క్యాటగిరిలో గుండమ్మ కథ సీరియల్ నుంచి ఆదికి అవార్డుని అందించారు సీనియర్ నటుడు పృద్వి రాజ్. ఉత్తమ కొడుకు క్యాటగిరిలో మా వారు మాష్టారు సీరియల్ యాక్టర్ గా నటించిన గణపతికి ఈ అవార్డుని అందించారు సుమ-రాజీవ్ కనకాల. నవనాయకుడు క్యాటగిరిలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ యాక్టర్ మిత్ర ఈ అవార్డుని అందుకున్నారు. ఉత్తమ వదిన- మరిది క్యాటగిరిలో గుండమ్మ- బాబీకి ఈ అవార్డుని పాయల్ రాజపుట్ అందించింది. జీ తెలుగు-వెలుగు క్యాటగిరిలో పల్లవి - మేఘనకు అవార్డ్స్ అందించారు పాయల్ రాజపుట్. ఇలా జీ తెలుగు అవార్డ్స్ షో మంచి ఫన్నీగా సాగింది.
Also Read