నిఖిల్ ఇచ్చిన పార్టీలో మెరిసిన సెలెబ్స్!
on Dec 26, 2022
యూట్యూబర్ గా నిఖిల్ విజయేంద్రసింహ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. యాంకర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లు ఎన్సర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతను చేసే ఇంటర్వ్యూలు కూడా ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.
టాలీవుడ్ నుంచి బుల్లితెర నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను నిఖిల్ ఇంటర్వ్యూలు చేశాడు. కొన్ని ఇంటర్వ్యూలు ఫన్నీగా ఉంటాయి ఇంకొన్ని మాత్రం గాసిప్స్ గా మారుతూ ఉంటాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఫేస్ బుక్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలను అడగాలనుకుని అడగలేకపోయిన ఎన్నో ప్రశ్నలను నిఖిల్ సరదాగా నవ్వుతూ అడిగేస్తూ ఉంటాడు. అలా నిఖిల్ ఎంతో బుల్లి తెర సెలబ్రిటీస్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.
క్రిస్మస్ పండగ సందర్భంగా నిఖిల్ తన ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేసి స్మాల్ , బిగ్ స్క్రీన్ సెలెబ్స్ ను ఇన్వైట్ చేసాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నిఖిల్ ఇచ్చిన పార్టీలో మంచు లక్ష్మి, ప్రగతి, రాజ్ తరుణ్, హంసానందిని, రాజశేఖర్ కుమార్తెలు, యాంకర్ అనసూయ, యాంకర్ ప్రదీప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడ్డారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
