ఘనంగా కమెడియన్ యాదమ్మరాజు, స్టెల్లా హల్దీ వేడుకలు!
on Dec 10, 2022
‘పటాస్’ కామెడీ షో ద్వారా బాగా పాపులరైన కమెడియన్ యాదమ్మ రాజు. ఆయన తర్వాత జీ తెలుగు నిర్వహించిన కామెడీ షోలో కూడా కొన్నాళ్ళు కామెడీ స్కిట్స్ వేసి ఎంటర్టైన్ చేసాడు. తన ఇన్నోసెంట్ ఫేస్ తో ఎలాంటి డైలాగ్స్ నైనా కామెడీగా చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు.
ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో కామెడీ స్కిట్స్ వేస్తూ అలరిస్తున్నాడు. ఇక యాదమ్మ రాజు ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ వేడుకను చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు స్టెల్లా …! వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళ పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. రీసెంట్ గా హల్దీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.
యాదమ రాజు- స్టెల్లా చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ మతాలు వేరైనా మనసులు కలిసేసరికి ఆ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడాయిని త్వరలో పెళ్లితో ఒకటి కాబోతున్నారు. 2020 ఆగష్టు 22న జీతెలుగులో ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే ఒక షోలో తన స్నేహితురాలిని పరిచయం చేశాడు యాదమ రాజు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
