మురారి ప్రేమని కృష్ణ దక్కించుకోగలదా.. ముకుంద ప్లాన్ ఏంటి?
on Sep 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -270 లో.. భర్తల దినోత్సవాన్ని కృష్ణ ప్లాన్ చేస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. భర్తల దినోత్సవానికి ఏర్పాట్లు చెయ్యండని భవాని అందరికి చెప్తుంది. మరొక వైపు ముకుంద కృష్ణని చూస్తూ.. ఏంటి కృష్ణ నా పైనే ఫోకస్ పెట్టింది. నా ప్రేమ విషయం తెలిసిందా, తెలియనివ్వు. ఇక ముసుగులో గుద్దులాటలు వద్దు డైరెక్ట్ గానే తేల్చుకుందామని ముకుంద తన మనసులో అనుకుంటుంది..
ఆ తర్వాత కృష్ణ కావాలనే మురారికి తన చీర కొంగు ఇచ్చి చెయ్యి తూడ్చుకోమని చెప్తుంది. అలాగే తన కొంగుతో మురారి మొహాన్ని తుడుస్తుంది కృష్ణ. అదంతా చూస్తున్న ముకుంద కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత ఎన్ని రోజులు మీ ప్రేమని దాచుకుంటారని అనుకుంటుంది. కావాలనే మురారిని కృష్ణ ఆటపట్టిస్తుంది. తన చిన్నప్పటి ఫోటో పట్టుకొని మీ బాగోతం మొత్తం తెలిసిపోయిందంటూ టెన్షన్ పెడుతుంది. అదేం ఫోటోనో అని అనుకుని మురారి కంగారుపడుతాడు. ఆ తర్వాత తన చిన్నప్పటి ఫోటో చూసి.. నన్నే అటపట్టిస్తావా అని కృష్ణ వెంబడి పరుగెట్టి ఆటపట్టిస్తాడు మురారి. ఆ తర్వాత భర్తల దినోత్సవం ఏప్రిల్ లో కదా? నువ్వు సెప్టెంబర్ అని అందరికి ఎందుకు అబద్ధం చెప్పావని కృష్ణని అడుగుతుంది భవాని. ముకుంద కోసం ఆదర్శ్ వచ్చేలోపు, ముకుంద అన్ని పనులు నేర్చుకుని ఆదర్శ్ ఇష్టాలు తెలుసుకొని, ఆదర్శ్ పైనే తన ధ్యాస ఉండేలా ఆదర్శే తన ప్రాణంగా ఉండేలా ముకుందని మార్చాలని అనుకుంటున్నానని భవానికి కృష్ణ చెప్తుంది. నాకు భర్తల దినోత్సవం ఇప్పుడు కాదన్న విషయం తెలిసిన నేను చెప్పలేదు.. ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వేం చేసిన మంచికే చేస్తావని నాకు తెలుసని కృష్ణతో భవాని అంటుంది.
మరొక వైపు నా ప్రేమ గురించి కృష్ణకి తెలిసిందనిపిస్తుంది. ఇక నుండి డైరెక్ట్ గానే తేల్చుకుంటానని అలేఖ్యతో ముకుంద అంటుంది. మరొక వైపు మురారికి ఇష్టమైనవేంటో అన్ని నాకు తీసుకొని వచ్చి ఇవ్వమని మధుకి కృష్ణ చెప్తుంది. దానికి మధు సరేనంటాడు. మరొక వైపు ఇంట్లో రేవతి పూజ చేసి ప్రసాదం అందరికి ఇస్తుంది. ఆ తర్వాత భర్తలకి భార్యలు తినిపించాలని ఇంట్లో అనుకుంటారు. మధుకి అలేఖ్య, ప్రసాద్ కి సుమలత తినిపిస్తారు. ఆ ప్రాసెస్ లో మధుణ అలేఖ్య ఇద్దరు ఒకరినొకరు సరదాగా అటపట్టించుకుంటారు. అప్పుడే కృష్ణ చెయ్యికి మధు తగిలి తన చేతిలోని ప్రసాదం కిందపడిపోతుంది. అలా పడిపోగానే మురారి వస్తాడు. నా దగ్గర ఉన్న ప్రసాదం మీరు తినండని కృష్ణకి ముకుంద చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



