హౌజ్ లో సేఫ్ ప్లేయర్ ఎవరు? గేమ్ చేంజర్ ఎవరు!
on Sep 24, 2023
బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్స్ యొక్క పర్ఫామెన్స్ ని డిసైడ్ చేయడానికి రెడ్, గ్రీన్, ఆరెంజ్ మీటర్ ని ఏర్పాటు చేసి చెప్పిన బిగ్ బాస్.. ఈ వారం తోటి కంటెస్టెంట్స్ తో ఎవరు సేఫ్ ప్లేయర్, ఎవరు గేమ్ ఛేంజర్ అని చెప్పమని డిసైడ్ చేశాడు. ఇక హోస్ట్ నాగార్జున వచ్చీ రాగానే అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు టాస్క్ లో యావర్ కి చేసిన మోసాన్ని చూపించాడు. ఆ తర్వాత ఎవరు సేఫ్? ఎవరు గేమ్ ఛేంజర్ అంటూ చెప్పమన్నాడు నాగార్జున. శోభా-గేమ్ చేంజర్, సేఫ్ గేమర్- శుభశ్రీ రాయగురు అని ప్రియాంక అంది. కిచెన్ పనులు, రోటి చేయడంలో తప్ప ఇంకేం చేయట్లేదని, టూ వీక్స్ నుండి నామినేషన్లో లేను. నాతో మంచిగా ఉండి నన్నే నామినేట్ చేసిందని, అందుకే శుభశ్రీ సేఫ్ ప్లేయర్ అని ప్రియాంక అంది. ఆ తర్వాత యావర్ - గేమ్ ఛేంజర్, టేస్టీ తేజ- సేఫ్ గేమర్ అని శుభశ్రీ అంది. ఇక అదే విషయాన్ని నాగార్జున చెప్తూ.. అంత సేపు గేమ్ ఆడావ్ యావర్. ఫెంటాస్టిక్ గేమ్ ఆడావ్. నీ ఓపికకి మించి ఆడావ్ యావర్. హ్యట్సాఫ్ అని నాగార్జున అన్నాడు.
ఇక ఆ తర్వాత సంఛాలక్ గా ఫేయిల్ అయ్యాడంటూ ఆట సందీప్ కి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఎంపైర్ అనేవాడు ఆటలో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆట సందీప్ తో నాగార్జున అన్నాడు. అయితే ఆట సందీప్ చేసిన దానికి ఏ శిక్ష వేయాలని శోభా శెట్టి, ప్రియాంక జైన్ లని డెసిషన్ తీసుకోమన్నాడు నాగార్జున. దాంతో వాళ్ళిద్దరు కలిసి టూ డేస్ జైలు లో పెడితే బెటర్ అని అన్నారు. దాంతో నాగార్జున మీరిద్దరు మళ్లీ రాంగ్ చేశారంటూ, మీ నిర్ణయం సరిపోదని ఆట సందీప్ బ్యాటరీని గ్రీన్ నుండి ఎల్లోకి తగ్గించేశాడు నాగార్జున. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని నాగార్జున ఎవరు సేఫ్, ఎవరు గేమ్ చేంజర్ అని అడుగగా.. గేమ్ ఛేంజర్ - యావర్, సేఫ్ గేమర్- టేస్టీ తేజ అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. సేఫ్ ప్లేయర్- టేస్టీ తేజ, గేమ్ చేంజర్ - ప్రియాంక జైన్ అని గౌతమ్ కృష్ణ అన్నాడు. సేఫ్ ప్లేయర్ - అమర్ దీప్ గేమ్ ఛేంజర్ - ప్రిన్స్ యావర్ అని దామిణి అంది.
శివాజీ పవరస్త్రని ఎందుకు దొంగిలించావని నాగార్జున అడగగా.. అతను హీరో అయితే నేను విలన్ అవుదామని తీసానని అమర్ దీప్ అన్నాడు. అతనికి బాగోలేదని, మెడికల్ వెళ్ళి రావడం చూసి బాధేసిందని, అలా బాగోలేనప్పుడు తీసుకోవడం కరెక్ట్ కాదని తన పవరస్త్రని తనకి ఇచ్చేశానని అమర్ దీప్ అన్నాడు. విలన్ అవుదామని అనుకుంటే కమేడియన్ వి అయ్యావని అమర్ దీప్ తో నాగార్జున అన్నాడు. పల్లవి ప్రశాంత్ ని గేమ్ చేంజర్ అని ప్రిన్స్ యావర్ అన్నాడు. నాకు సపోర్ట్ గా నిలిచాడు. ఇది కాకపోతే ఇంకోటి అంటూ నాకు నమ్మకాన్ని కల్పించాడు ప్రశాంత్ అందుకే అతను గేమ్ చేంజర్ అని యావర్ అన్నాడు. హౌజ్ లో సేఫ్ ప్లేయర్ దామిణి అని ప్రిన్స్ యావర్ అన్నాడు. ఇక హౌజ్ మొత్తంలో ఎక్కువగా గేమ్ ఛేంజర్ ట్యాగ్ ప్రిన్స్ యావర్ కి రావడంతో అతనే ఈ మూడవ వారం గేమ్ ఛేంజర్, సేఫ్ ప్లేయర్ టేస్టీ తేజ అని నాగార్జున అన్నాడు. రతిక అసలు ఈ వీక్ గేమ్ ఆడలేదని, అసలెక్కడా కన్పించలేదని రతికని నాగార్జున అన్నాడు. పల్లవి ప్రశాంత్ గేమ్ ని అలా ఎలా మధ్యలో వదిలేసావని అనగా.. ఇక నుండి పోరాడతాను సర్ పల్లవి ప్రశాంత్ అన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ ఎవరు సేఫ్, ఎవరు గేమ్ ఛేంజర్ అంటు సాగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



