Vishnupriya Biggboss: హర్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను
on Dec 26, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ ఆటతీరు, మాటతీరుతో ఎంతోమందికి సుపరిచితమైంది. బిగ్ బాస్ కి వెళ్ళకముందే యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. అడపాదడపా సినిమాలు, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ లలో చేసింది. అయితే తనకు ఫుల్ లెంత్ నటించే ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు తనకి నెగెటివ్ పబ్లిసిటి వచ్చింది. దానికి కారణం పృథ్వీ ఎందుకంటే ఎక్కువ సమయం పృథ్వీతో గడపడం, తనకి కాఫీ చేసి ఇవ్వడం.. ఆ కప్పు తీసుకెళ్లి కడగడం.. అతడికి షూస్ తొడగడం.. ఇంకా ఓ వీకెండ్ ఎపిసోడ్ లో లైవ్ లో పృథ్వీకి ముద్దుపెట్టడం.. ఇలా ప్రతీ దగ్గర విష్ణుప్రియకి మైనస్ అయ్యింది. అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన విష్ణుప్రియ నిన్న క్రిస్మస్ రోజున పృథ్వీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ యష్మీతో పాటు దిగిన ఫోటోలని పృథ్వీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
విష్ణుప్రియ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ అప్లోడ్ చేసింది. అందులో బిగ్ బాస్ హౌస్ లో తనెందుకు అలా ఉందో చెప్పుకొచ్చింది. నలభై అయిదు నిమిషాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో తనేం చెప్పిందంటే.. గత రెండేళ్లుగా దైవచింతనలో ఉన్నాను. నాకు కోపం ఎక్కువ.. ఇగో ఎక్కువ.. వాటిని నేను ఎంత వరకూ కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో తెలుసుకోవాలనిపించింది. నాకు సీజన్ 3 నుంచి బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉంది. ఈసారి మా గురువు గారు బిగ్ బాస్‌కి వెళ్లమని చెప్పారు. ఆయన చెప్పారనే వెళ్లాను. నేను చేసిన ప్రాక్టీస్ అంతా ఎంత వరకూ అప్లై చేయగలుగుతున్నాను. ఎంత వరకూ నన్ను నేను మార్చుకున్నానో తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ మంచి అవకాశం అనిపించింది. అందుకే వెళ్లాను.. కానీ వెళ్లిన తరువాత వేరే విధంగా అయ్యింది. నేను లోపల ఉన్నప్పుడు.. నా గురించి చేస్తున్న కామెంట్స్ విని.. వీళ్లకి నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదా? బయటకు ఎలా వెళ్తుందో అన్న భయం ఉండేది. బయటకు వచ్చిన తరువాత.. నేను మంచి పేరుతోనే వచ్చాను అని అనిపించింది. కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. ఎమోషనల్‌గా నేను వీక్ కావడం వల్ల జెన్యూన్‌గా అక్కడ సపోర్ట్ చేసేవాళ్లు ఉండరు. అదో ఎడారి లాంటిది. నాకు బిగ్ బాస్ హౌస్‌లో పీరియడ్స్ వచ్చినప్పుడు.. పీరియడ్స్ రావడానికి ఐదురోజుల ముందు హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ జరిగాయి. కానీ నా గ్రౌండ్, నా కంపోజర్, నా ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలనుకున్నదే నా మెయిన్ అజెండా. దానికే ప్రయత్నించానంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.