'జబర్దస్త్'లో మెరిసిన 'వకీల్ సాబ్' సూపర్ వుమన్!
on Jul 19, 2021
'సూపర్ ఉమన్... సూపర్ సూపర్ సూపర్ ఉమన్' - 'వకీల్ సాబ్' సినిమాలో కోర్టు రూమ్‌లో పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. అంతే కాదు, ఆ సీన్‌లో నటించిన లిరీషాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడామెను 'జబర్దస్త్' స్టేజి మీదకు తీసుకొచ్చాడు రాకెట్ రాఘవ. జూలై 22న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో సూపర్ ఉమన్ సందడి చేయనున్నారు.
'నేను సూపర్ ఉమన్ రా. ఎక్కడికైనా సరే పదిహేను నిమిషాల్లో వెళ్లిపోతా తెలుసా' అని సూపర్ ఉమన్ అలియాస్ లిరీషా చెప్పిన డైలాగ్ తో లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కట్ చేశారు. 'ఆల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి సిర్ఫ్ పంద్రామినిట్ లో వచ్చిండ్రమ్మా మీరు' అని పవన్ అడగటం, 'సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్‌లో వచ్చేసినా' అని లిరీషా చెప్పడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. దానిని మరోసారి గుర్తు చేశారు.
రాకెట్ రాఘవ ఎపిసోడ్‌లో కూడా లిరీషా పోలీస్ గా కనిపించనున్నారు. ప్రోమో చూస్తుంటే టీమ్ కంటెస్టెంట్ నాగిని చితక్కొట్టే సీన్లు బాగా తీసినట్టు ఉన్నారు. నిజం చెప్పాలంటే... 'వకీల్ సాబ్' కంటే ముందు టీవీ ప్రేక్షకులకు లిరీషా తెలుసు. 'అమ్మనా కోడలా', 'అక్కాచెల్లెళ్లు' సీరియళ్ళలో నటించారు.
Also Read