Home

»

Tv News

చిరంజీవి మనసులో జూనియర్ పూజా హెగ్డే!

Jun 16, 2022 12:59PM

ఆహా ఓటిటి పై తెలుగు ఇండియన్ ఐడల్ షో మంచి స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఎవరు అనే విషయం తేల్చాల్సిన సమయం వచ్చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ రాబోతున్నారు. ఆయన చేతులమీదుగా ఇండియన్ ఐడల్ టైటిల్ ని విన్నర్ కి అందించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ టైంలో చిరంజీవి వాగ్దేవి మీద ఒక కవితను చెప్పారు.

"డియర్ వాగ్దేవి, నువ్వు నా మనసులో జూనియర్ పూజా హెగ్డేవి, నా రూములో పెట్టుకున్న ఫోటో నీది..." అంటూ గుటకలు మింగుతూ "ఇది నేను రాయలేదు ప్రామిస్" అంటూ చిరంజీవి వాగ్దేవి గురించి చదివిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చేసింది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్  ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం పోటీపడబోతున్నారు. ఈ ఐదుగురిలో వాగ్దేవి ఒకరు. 17 న జరగబోయే తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే కాస్త మెగాస్టార్ రాకతో మెగా ఫినాలేగా మారబోతోంది. 

ఇక వాగ్దేవి తన హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది. బాలయ్య, మెగాస్టార్ ఇద్దరూ కూడా వాగ్దేవిని పూజా హెగ్డేతో పోల్చడం, తను సంతోషపడడం స్టేజి మీద చూసాం. బాలయ్య కూడా ఈ షోకి వచ్చి  ఒక బిరుదు ఇచ్చేసారు. వాగ్దేవి కాదు వావ్ దేవి అని. ఈ మెగా ఫినాలే ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.  మరి ఈ మెగా ఫినాలేలో వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com