యంగ్ లుక్ లో రంజుగా అన్‌స్టాపబుల్ బాలయ్య.. ఫ్యాన్స్ కి ఐఫీస్ట్
on Oct 9, 2022

"ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!! మీకోసం... మరింత రంజుగా అన్‌స్టాపబుల్" అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి ఫుల్ జోష్ నింపాడు. అన్‌స్టాపబుల్ సీజన్-2 ట్రైలర్ లో బాలయ్య అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన లుక్ సూపర్ అని చెప్పొచ్చు.
ఒక చీకటి గుహలో నిధి కోసం వెతుకుతూ "అంధకార అభయరణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమాజినబుల్.. అక్కడ ఎదురయ్యే సవాళ్లు అన్ ప్రెడిక్టబుల్, అయినా ఆగని మన పోరాటం అన్ స్టాపబుల్" అని చెప్పి "గెలుపే ఊరిపిగా, పట్టుదలే ప్రాణంగా, ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్ స్టాపబుల్" అంటూ ఒక కనిపెట్టిన ఒక నిధి పెట్టెలోంచి ఒక బంగారు ఖడ్గం తీసి ఆ గుహ నుంచి మోడరన్ లుక్ లో అన్ స్టాపబుల్ షోలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఖడ్గాన్ని తిప్పుతూ "ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా?" అని బాలయ్య పంచ్ డైలాగ్స్ తో, మాస్ అండ్ క్లాస్ యాక్షన్ తో మీసం మెలేసి చెప్పే డైలాగ్ వేరే లెవెల్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ టాక్ షో సీజన్-2 అక్టోబర్ 14నుంచి ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని ట్రైలర్లో చూపించారు. అయితే ఈ సారి మొదటి ఎపిసోడ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



