'బోత్ ఆర్ నాట్ సేమ్'.. బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఊగిపోయిన శ్రుతి!
on Sep 27, 2022
.webp)
బుల్లితెర మీద వరుసగా కొత్త కొత్త షోస్ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా "బంగారు బతుకమ్మ" పేరుతో ఈటీవీలో ఒక ఈవెంట్ రాబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అత్తలకు, కోడళ్ళకు మధ్య యుద్ధం ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించారు. ఈ షో అక్టోబర్ 2న ప్రసారం కాబోతోంది. శ్రీముఖి ఈ షోకి హోస్ట్ గా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సీనియర్ నటీమణులు అత్తల క్యారెక్టర్స్ చేయగా, జూనియర్ యాక్టర్స్ అంతా కోడళ్ళుగా మారి అత్తలకు సేవలు చేస్తూ ఉంటారు.
ఈ షోలో ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరి పంచ్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. "కోడళ్ళు అత్తల ముందు భయపడతారు.. అత్తలు కోడళ్లను భయపెడతారు.. బోత్ ఆర్ నాట్ సేమ్" అంటూ నటి శ్రుతి వీర లెవెల్లో బాలయ్య బాబుని ఇమిటేట్ చేసే ఒక డైలాగ్ చెప్పి స్టేజి మీద ఫైర్ పుట్టించింది.
"మొబైల్ మాత్రమే వైబ్రేట్ ఐతే అది మిస్డ్ కాల్. మొబైల్ తో పాటు మొబైల్ పట్టుకున్నోడు వైబ్రేట్ ఐతే అది మిస్సెస్ కాల్" అంటూ పవిత్ర అద్దిరిపోయే డైలాగ్ చెప్పి "భళా" అనిపించుకుంది. ఇక ఈ షోకి ఫోక్ సింగర్ మధుప్రియ వచ్చి బతుకమ్మ మీద జానపదాలు ఆలపించింది. ఈమెతో పాటు కనకవ్వ కూడా ఈ స్టేజి మీదకు వచ్చింది. ఈ స్టేజి మీద అందరూ బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి పాటలు పాడి ఆడియన్స్ ని హుషారెత్తించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



