యాక్టర్లూ అంత ఓవరాక్షన్ వద్దు! వైరల్ అయిన టీవీ నటి పోస్ట్!!
on May 12, 2021
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అందరూ వ్యాక్సిన్ కోసం కోవిడ్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు టీకా తీసుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఎలాంటి ప్రాణహాని ఉండదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఇక్కడవరకు బాగానే ఉంది కానీ.. వ్యాక్సిన్ తీసుకుంటూ కొందరు సెలబ్రిటీలు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నామంటూ ప్రముఖ టీవీ నటి ఆషా నేగి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని.. చాలా చిరాకుగా ఉంటుందంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందో చెప్పలేదు. కానీ ఈ పోస్ట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు నటి అంకిత లోఖండే గురించని అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల అంకిత వ్యాక్సిన్ తీసుకుంటూ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భయపడుతూ, దేవుడిని ప్రార్ధిస్తూ టీకా వేసుకుంది. దీంతో పాటు ఆమె మరొక సెటైర్ కూడా వేసింది. "ఇక అంతా అడుగుతున్నారు.. వీడియోగ్రాఫర్ ని మీరే తీసుకువెళ్తారా.. లేక ఆస్పత్రి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారా అని'' అంటూ పోస్ట్ చేసింది ఆషా.
Also Read