కన్నడ వర్సెస్ తెలుగు వివాదంపై నూకరాజు...టీఆర్పీ కోసం ఇంత దిగజారతారా!
on Dec 30, 2024
బిగ్ బాస్ సీజన్-8 తో తెలుగు-కన్నడ వివాదం ఊపందుకుంది. దాంతో షోలలో దీన్ని వాడుకొని టీఆర్పీ పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే రీసెంట్ గా ప్రేరణ కంభం దీనిపై ఫుల్ ఫైర్ అవ్వగా అంతకముందు సీనియర్ యాక్టర్ కౌశిక్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు దానిని కొనసాగిస్తూ నూకరాజు, యాంకర్ సౌమ్య మరోసారి హీటెడ్ ఆర్గుమెంట్స్ చేసుకున్నారు.
ఈటీవీలో ప్రసారమవుతున్న 'సుమ అడ్డా' షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోపై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నడకి చెందిన యాంకర్ సౌమ్యరావుని అవమానిస్తున్నట్లు ఈ ప్రోమోలో చూపించగా.. ఇది చూసి చాలా మంది కన్నడ ఆడియన్స్ ఈటీవీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు విషయమేంటంటే.. డిసెంబర్ 31న రాత్రి 9.30కి 'దావత్' అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే వచ్చింది. ఇందులో కన్నడ వర్సెస్ తెలుగు అంటూ ఓ వివాదాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ ప్రోమోలో ఏం ఉందంటే.. యాంకర్ సౌమ్య, నూకరాజు ఇద్దరు వాగ్వాదానికి దిగారు. నా మాతృభాష కన్నడ.. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇంతలా తెలుగు మాట్లాడుతున్నానంటే చాలా గొప్ప విషయమంటూ సౌమ్య చెప్పగా.. మీరు పది మాటలు మాట్లాడితే అందులో ఎనిమిది బూతులు ఉంటాయని నూకరాజు అన్నాడు. దీంతో అలా అయితే మీరు కన్నడకి వచ్చి కన్నడ భాష నేర్చుకొని మాట్లాడి చూడండి అంటూ సౌమ్య ఆవేశంగా అంది. నాకు కన్నడ రానప్పుడు నేను అసలు అక్కడికి వెళ్లను మేడమ్ అంటూ నూకరాజు ఫైర్ అయ్యాడు. దీంతో మరి ఇలా ఉన్నప్పుడు నన్ను షోకి పిలవకండి.. మీ తెలుగువాళ్లనే పిలుచుకోండి అంటూ సౌమ్య అంది.
ఇది ప్రోమోలో ఉంది. ఇక కొంతమంది కన్నడ అభిమానులు నూకరాజుని తిడుతూ పోస్టులు చేస్తున్నారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే మల్లెమాల టీమ్ ఇప్పటికే ఇలాంటి టీఆర్పీ స్టంట్స్ చాలానే చేసింది. ఇది కూడా వైరల్ అవ్వడం కోసం.. ప్రోమో ట్రెండ్ అవ్వడం కోసమే ఇలా చేశారని దాదాపు అందరికి తెలుసు. కానీ కొంతమంది దీనిని షార్ట్స్, రీల్స్ లో వారికి అనుగుణంగా కట్ చేసుకొని ప్రాంతీయత్వాన్ని రెచ్చగొడుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Also Read