టేస్టీ తేజని చిన్నపిల్లాడిని చేసి ఆడుకున్నారు...
on Feb 26, 2024
టేస్టీ తేజ ఈమధ్య కాలంలో ఫుల్ ఫార్మ్ లో ఉంటున్నాడు. షోస్ లో, ఈవెంట్స్ లో అలాగే షాప్ ఓపెనింగ్స్ లో ఇంకా బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ తో ఎక్కడికంటే అక్కడికి ప్రమోషన్స్ కి వెళ్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. అలాంటి తేజని ఒక కుక్క పిల్ల భయపెట్టేసింది. అదేంటో చూద్దాం. తేజ ప్రియాంక జైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి ఒక గ్రీన్ కలర్ లో ఉన్న చిన్న తాబేలు పిల్లను తెచ్చింది. దాని పేరేంటని అడిగాడు తేజా. నక్షత్ర అని దాని వయసు 8 ఏళ్ళు అని చెప్పింది ప్రియాంక.. "తాబేలును పట్టుకోవచ్చా" అని అడిగేసరికి "పట్టుకోమని చెప్పింది"..వెంటనే ఆ తాబేలును పట్టుకుందామని అనుకునే లోపు ప్రియాంక పెంచుకుంటున్న కుక్క గట్టిగా అరిచేసింది..దాంతో తేజ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
ఎం జరుగుతుందో తెలీక సోఫాలో దొర్లాడు. "మా మమ్మి దగ్గరకు ఎందుకు వెళ్తున్నావ్ అని అది నీ మీద అరుస్తోంది" అని చెప్పింది ప్రియాంక. "ఓహ్ మమ్మీ అంటే నువ్వా" అని తేజా అర్ధం చేసుకుని మీ మమ్మిని ఎం చేయట్లేదు" అని చెప్పినా అది తేజ మీద అరుస్తూనే ఉంది. ఈ వీడియోని తేజ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. దీన్ని చూసి నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "పాపం అసలే చిన్నోడు అలా భయపెడితే ఎలా.. పాపం తేజ..కుక్క ప్రియాంకకు చాలా విశ్వాసంగా ఉంది " అంటున్నారు. ఇక తాబేలు బాగుంది అంటూ గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు. తేజ ఇంతకు ముందు ఇదే ప్రియాంక ఇంట్లో గుండె నొప్పి వచ్చినట్టు ఒక ప్రాంక్ వీడియో చేసి అందరినీ షాక్ కి గురి చేసాడు. ఇలా తేజ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
