ఎలాగైనా పొట్ట తగ్గించి నాగ్ సర్ టీ షర్ట్ తెచ్చుకుంటా...
on Dec 4, 2024
బిగ్ బాస్ సీజన్ 8లో టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఈ సీజన్ ని సస్టైన్ చేయడం కోసం కొత్త ప్లాన్ వేసాడు. జనరల్ గా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎలా ఐతే కలుసుకుంటూ ఉంటారో ఆ కాన్సెప్ట్ ని తెరమీదకు తీసిచ్చాడు. అలాగే ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో కొంతమందిని హౌస్ లోకి తెచ్చి రేటింగ్స్ కోసం ప్రయత్నించాడు. బిగ్ బాస్ చరిత్రలో ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అది సక్సెస్ కొట్టింది. ఇక తేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక మీడియాకి కొన్ని విషయాలను చెప్పాడు. "బిగ్ బాస్ 7 లో మేమంతా బాగా ఆడాం..గౌతమ్ కానీ నిఖిల్ కానీ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా రోహిణి విన్ ఐతే ఇంకా బాగుంటుంది.
ఆ సీజన్ లో గౌతమ్ చాలా కష్టపడి ఆడాడు...ఇంకా ఒక్క వారం ఉంది. గట్టిగా స్టాండ్ తీసుకోమని గౌతమ్ కి చెప్పాను. బిగ్ బాస్ అనేది జెన్యూన్ ఎమోషన్. అందులో ఏది ఫేక్ గా చేయాలి అన్నా తెలిసిపోతుంది. విష్ణు ప్రియా, పృద్వి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే...వాళ్ళ మధ్య ఇంకేమీ లేదు. రోహిణి గేమ్ బాగా ఆడుతోంది. గౌతమ్, నేను, అవినాష్, రోహిణి అందరం వైల్డ్ కార్డ్స్ ద్వారా వెళ్లి ఇంతకు ముందు బిగ్ బాస్ లో ఫుల్ ఫిల్ చేసుకోలేనివి అన్నీ పట్టుదలతో కష్టపడి ఆడి ఈ సీజన్ లో నెరవేర్చుకున్నాం. ఫస్ట్ టైం బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు అది గ్రేట్ ఎక్స్పిరియెన్స్ ఐతే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎన్నో మెమోరీస్ ని ఇచ్చింది బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ కాదు..స్క్రిప్టెడ్ ఐతే అందరూ విన్నర్ అవడం కోసమే స్క్రిప్ట్ అడుగుతారు. ఇక నేను పొట్ట తగ్గిస్తే నాగ్ సర్ టీ షర్ట్ ఇస్తాను అన్నారు..కానీ నేనే తగ్గడం లేదు. ఎలాగైనా తగ్గి టీ షర్ట్ తీసేసుకుంటా" అంటూ తేజా చెప్పుకొచ్చాడు.
Also Read