కేరళలో సోహైల్...అప్పుడప్పుడు చిన్న బ్రేక్స్ అవసరం
on Oct 17, 2024
బిగ్ బాస్ ద్వారా పాపులరైన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ నేమ్ ని, ఫేమ్ ని సరిగ్గా వాడుకుని కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే. అలాంటి వారిలో సయ్యద్ సోహైల్ ర్యాన్ ఉన్నాడు. బిగ్ బాస్ తర్వాత చిన్నగా హీరోగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. హీరోగా సక్సెస్ కాకపోయినా ఒక మాదిరి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
అలాంటి సోహైల్ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. ఐతే రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు సోహైల్. "ఒకే ఒక్క జీవితం ఉంటుంది ఎవరికైనా అందులో అడ్డంకులు, సమస్యలు ఒక భాగం. ఐనా మనం ముందుకు సాగాలి. కొన్నిసార్లు, మనల్ని మనం రీసెట్ చేసుకోవడానికి రీఛార్జ్ కావడానికి ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ అవసరం. నా కేరళ ట్రిప్ నన్ను ఎంతో రీఛార్జ్ చేసింది. , అది నాకు అవసరమైన విరామం ఇచ్చింది.." అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇక నెటిజన్స్ ఐతే "మీరు హ్యాపీగా ఉంటె అంతే చాలు అని...సూపర్ గా ఉంది కేరళ" అంటూ కామెంట్స్ ని పోస్ట్ చేస్తున్నారు.
Also Read