కళింగపట్నం రెస్టారెంట్ తో మీ సయ్యద్ సోహైల్...ఆరు నెలల్లో పెళ్లి ఫిక్స్
on Dec 27, 2024
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పడి లేచిన కెరటం అంటూ అతని అభిమానులు అంటూ ఉంటారు. ఇక సోహెల్ కెరీర్ విషయానికొస్తే వరుణ్ సందేశ్ ఫస్ట్ మూవీ ‘కొత్తబంగారు లోకం’ తో సయ్యద్ సోహెల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో సోహైల్ పెద్దగా కనిపించడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తదితర సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు. సోషల్ మీడియాలో బాగా క్రేజ్ రావడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు సోహైల్. కథలపరంగా సినిమాల సెలెక్షన్స్ బాగున్నా ఆ మూవీస్ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో ఒకానొక టైమ్ లో తన సినిమాను చూడమని వేడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సొహైల్. అలాంటి సోహెల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఎన్నో వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు.
ఇక రీసెంట్ గా ఫుడ్ బిజినెస్ లోకి దిగాడు సయ్యద్ సోహెల్. మణికొండలో "కళింగపట్నం" పేరుతో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసాడు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాత , కొత్త బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. అందులో పల్లవి ప్రశాంత్, గౌతమ్, అఖిల్ సార్థక్, టేస్టీ తేజ, ఆకాష్ పూరి, వరుణ్ సందేష్ , రాహుల్ సిప్లిగంజ్, శుభశ్రీ, మణికంఠ, విజె సున్ని, రాజు జయమోహన్, సౌమ్య జానూ, అలీ వైఫ్ జుబేదా సుల్తానా, మెహబూబ్ వంటి వాళ్లంతా వచ్చి విష్ చేశారు. అలాగే సోహెల్ వాళ్ళ నాన్న కూడా తన బిడ్డ ఇంతలా ఎదగడం ఎంతో సంతోషముగా ఉందని చెప్పారు. అలాగే మరో ఆరు నెలల్లో సోహెల్ పెళ్లి చేయబోతున్న అని చెప్పాడు. పెద్దలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని సోహెల్ చెప్పాడంటూ ఆయన తండ్రి చెప్పుకొచ్చాడు.
Also Read