బెట్టింగ్ యాప్స్ ని ఇక ప్రమోట్ చేయను.. సారీ...
on Mar 15, 2025
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వాటిని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్లను పోలీసులు ఊరుకోవడం లేదు. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఇష్యూ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇలాంటి టైములో సురేఖ వాని కూతురు సుప్రీతా హోలీ రోజున హోలీ కలర్స్ ఒళ్ళంతా పులుముకుని ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
"కొంతమంది ఇన్‌ఫ్లుయన్సర్స్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అందులో నేను ఒకదాన్ని. కానీ ఇప్పుడు ప్రమోట్ చేయడం ఆపేసాను. ప్రమోట్ చేసినందుకు సారీ. ఎవరైనా ఇన్‌ఫ్లుయన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు మీరు చూసినా వాటికి అట్రాక్ట్ కావొద్దు.. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి. ఇంకా వాళ్ళను ఫాలో కూడా అవ్వొద్దు. అందరికీ థాంక్యూ అండ్ ఒన్స్ అగైన్ సారీ" అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే ఈ వీడియోని వి.సి. సజ్జనార్ కి కూడా ట్యాగ్ చేసింది.
తెలంగాణా ఆర్టీసీ ఎండి, ఐపిఎస్ సజ్జనార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద బాగా ఫోకస్ చేశారు. ఈ మధ్య కాలంలో ఎన్నో కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ వలన సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది కూడా బెట్టింగ్ యాప్స్ వలన అంటూ వీడియోస్ చేసి మరీ మరణిస్తున్నారు. దాంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు సే నో టు బెట్టింగ్ అనే హ్యాష్ టాగ్ బాగా సర్క్యులేట్ అవుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
