సుహాసినిది నాది జన్మజన్మల బంధం.. అన్ స్టాపబుల్ బాలయ్య
on Dec 15, 2023
అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ 3 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కు ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి పరాన్జీ, అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ సుహాసిని, మరో హీరోయిన్ శ్రియ ఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలోనే ఎంటర్టైన్మెంట్ అదరహో అన్నట్టుగా ఉంది. "సుహాసినిది నాది జన్మజన్మల బంధం" ఇక "నాది శ్రేయది ఈ మిలీనియం బంధం" అంటూ బాలయ్య వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి క్రిస్పీగా చెప్పారు.
"అప్పుడు బాలా చాలా షై" అంటూ సుహాసిని ఆనాటి రోజుల గురించి చెప్పేసరికి "మేము నమ్మం" అన్నారు శ్రియ, హరీష్ శంకర్. "నాకు హరీష్ శంకర్ కి పాత కక్షలు ఉన్నాయి అందుకే అతన్ని అవాయిడ్ చేసి మీ ముగ్గురితోనే మాట్లాడుతున్నా" అన్నారు బాలయ్య. "నేను అందుకే బ్రో అన్నా " అని హరీష్ శంకర్ చెప్పగానే "స్టూడియో గేట్లు వెయ్యండయ్యా" అంటూ బాలయ్య కామెడీ కామెంట్స్ చేశారు. "ఏమిటి హాలిడేసా ఫ్రీగా ఉన్నావ్" అని బాలయ్య హరీష్ ను అడగగా “ఈ గ్యాప్ మటుకు వెకేషన్.. సినిమా రిలీజ్ అయిన తర్వాత సెన్సేషన్” అని అన్నారు. ఆ తర్వాత సుహాసిని మాట్లాడుతూ "బాలతోనే నేను ఫస్ట్ బ్లాక్ బస్టర్ చూశానని" చెప్పారు.
ఆ తర్వాత బాలయ్య, సుహాసిని కలిసి "దంచవే మేనత్త కూతురా" సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. డాన్స్ ఐపోయాక హరీష్ శంకర్ బాలయ్యని " మేము కూడా సరదాగా కొన్ని ప్రశ్నలు అడగొచ్చా" అని పర్మిషన్ అడిగేసరికి "కాపీ కొట్టకు బ్రో..మెలికలు తిరగకు బ్రో" అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు. తర్వాత సుహాసిని రాపిడ్ ఫైర్ ఆడారు. "మీరు ఎక్స్ పెక్ట్ చేసినట్టు ఎవరైనా మాట్లాడలేదని అనిపించిందా" అనేసరికి ఎవరు అని హరీష్ శంకర్ అడిగేసరికి మీవాడే అనడంతో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన మేనరిజమ్ ని చూపించాడు.
తర్వాత "ఎప్పుడైనా మీకు ఒక గెస్ట్ అన్ స్టాపబుల్ గా మాట్లాడారని, ఆపట్లేదు అనిపించారా ఎవరైనా" అని జయంత్ సి పరాన్జీ అడిగేసరికి "రవితేజ" అని టక్కున సమాధానం ఇచ్చారు. ఇక ఇలాంటి ఎన్నో చమక్కులు, చురుక్కులు పేల్చారు బాలయ్య.. ఇక ఈ ప్రోమో శ్రీయ ప్రస్తుతానికి సైలెంట్ గా కనిపించింది. మరి ఎపిసోడ్ చూస్తే ఆమె మాట్లాడిందో తెలుసుతుంది. ఈ ఎపిసోడ్ ఆహలో 22 న స్ట్రీమ్ కాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
