బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద సుదీప కామెంట్స్!
on Oct 17, 2022
బిగ్ బాస్ హౌస్ నుంచి సుదీప ఎలిమినేట్ ఐపోయి బయటికి వచ్చేసింది. ఇక బయటికి వచ్చిన సుదీప కొన్ని ఇంటర్వూస్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. "కీర్తిభట్ చాలా మంచిది. ఏదైనా స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది. కానీ అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది. అది తగ్గించుకుంటే మంచిది. ఫైమా ఇంకా చిన్న పిల్ల. చాలా కూల్. కాకపోతే ఇంకా ఇమ్మెచ్యూర్.. ఫైమా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చింది. షీ ఈజ్ స్వీట్.
ఇక హౌస్ లో ఉన్న 20 మందికి రెండు వాష్ రూమ్స్, రెండు స్నానాల గదులు మాత్రమే ఉంటాయి. అందరూ టైంకి రెడీ అవ్వాలి అంటే కొంచెం కష్టమే మరి. హౌస్ లో ఉండేవాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక బిగ్ బాస్ టీమ్ నాకు హై రెమ్యూనరేషన్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళలేరు, రావాలి అనుకుంటే రాలేరు.
ఇక లవ్ ట్రాక్స్ విషయం గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు..నాకు ఇచ్చిన వర్క్ నాకే సరిపోయేది..దాంతో అనవసర విషయాలను పెద్దగా పట్టించుకోను. ఇక గీతూ విషయానికి వస్తే గేమ్ గురించి మొత్తం తెలుసుకుని వచ్చింది కాబట్టి గేమ్ ని గేమ్ లాగే ఆడుతోంది. ఇక నా ఎలిమినేషన్ గురించి నెగటివ్ టాక్ ఏమీ రాలేదు పాజిటివ్ టాక్ వచ్చింది. అది హ్యాపీ. పింకీ అంటే వంటగది అనే కామెంట్ మంచి విషయమే కదా" అంటూ సుదీప ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
