Home

»

Tv News

టాప్ ప్లేస్ లో ఏ సీరియల్ ఉందంటే...స్టార్ మా సీరియల్స్ లిస్ట్ ఇదే

Feb 14, 2026

 

బుల్లితెర మీద ప్రసారమయ్యే తెలుగు సీరియల్స్ కి సంబంధించి ప్రతీ వారం టిఆర్పి రేటింగ్స్ లిస్ట్ వస్తూ ఉంటుంది. ఇక  స్టార్ మా సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఇంకో సీరియల్ ఉంటుంది. "లీడర్ షిప్ అనేది చెప్పుకోకూడదు, సంపాదించుకోవాలి.  ప్రతీ సాయంత్రం, ప్రతీ ఇంట్లో నుంచి అది మా ఛానెల్ కి అందుతుంది. స్టార్ మాలో, మేము మా ప్రేక్షకుల ప్రపంచాన్ని.. వారి బలాన్ని, వారి కుటుంబాలను, వారి కలలను, వారి భావోద్వేగాలను ప్రతిబింబించే కథలను అందిస్తూ ఉంటాం. 


ఆడియన్స్ మా సీరియల్స్ ని టాప్ 5లో ఎన్నుకున్నప్పుడు  మాకు ఒక విషయం అర్ధమవుతుంది. ఇది  కేవలం ఒక ఛానెల్ కాదు. వారి దైనందిన జీవితంలో ఒక భాగం అని .మా మీద మీకున్న  ప్రేమ , నమ్మకానికి ధన్యవాదాలు. దీన్ని మరింత బాధ్యతతో నిర్వహిస్తాము" అంటూ స్టార్ మా తన టాప్ సీరియల్స్ ఏవేవో  చెప్తూ ఒక పోస్ట్ ని పెట్టి ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. అందులో కార్తీక దీపం పార్ట్ 2 సీరియల్ 12 .7 , గుండె నిండా గుడిగంటలు 12 .6 , ఇల్లు ఇల్లాలు పిల్లలు 12 .4 , పొదరిల్లు 11 .2 , ఇంటింటి రామాయణం 10 . 8 రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.   

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com