వార్నీ శోభా శెట్టి వాళ్ళు విడిపోయారు నీకు తెలీదా?
on Dec 4, 2025

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది..ట్రెండీ గర్ల్స్ వెర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్ పేరుతో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది. ఈ షోకి కావ్యశ్రీ, కుట్టి, యష్మి, ప్రియాంక జైన్, శోభా శెట్టి వంటి వాళ్లంతా వచ్చారు. రాగానే కావ్య "నీ ప్రకారం ట్రెండీ అబ్బాయి ట్రెడిషనల్ అబ్బాయి అంటూ హరిని, అవినాష్ ని చూపించింది. "ఇద్దరూ ట్రెండీగా కానీ ట్రెడిషనల్ గా కానీ లేరు. ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోయినట్టున్నారు" అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. "అమ్మగారు నా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయండి. నేను ట్రెండీ అమ్మాయిలను చేసుకోవాలా ట్రెడిషనల్ అమ్మాయిలను చేసుకోవాలో అర్ధం కావాట్లేదు" అన్నాడు హరి. వెంటనే అవినాష్ వచ్చి "నీ కోసం అమ్మగారు మంచి అరేంజ్మెంట్స్ చేశారు. తల్లి నలుగురు కూతుళ్లను తీసుకొచ్చింది" అంటూ రోహిణిని చూపించాడు.
.webp)
"కమిటెడ్ కానీ అమ్మాయిలను తీసుకొస్తున్నారు. ఈమె కమిటెడ్ కదా" అంటూ శోభా వైపు చూపించేసరికి "వాళ్ళు ఆల్రెడీ విడిపోయారు నీకు తెలీదా" అని శ్రీముఖి అనేసరికి హరి, శోభా శెట్టి ఇద్దరూ షాకై నవ్వేశారు. "అమ్మగారు ఒకసారి కుట్టిని చూడండి మాయాబజార్ మూవీలో సావిత్రిలా లేదు" అన్నాడు హరి. "నువ్వు కూడా బజార్ లో తిరిగే లోఫర్ లా లేవు" అనేసింది శ్రీముఖి. "మా మల్లి సీరియల్ లో మల్లీలు మారి మారి చివరాఖరికి ఈ మల్లెపువ్వు వచ్చింది మల్లిగా" అని శ్రీముఖి చెప్పింది. "నీ పేరేమిటి" అని అడిగింది. "చరిత్ర" అని చెప్పింది. "చరిత్రలో అందమైన అమ్మాయిలూ ఉంటారని విన్నా కానీ చరిత్రే ఇంత అందంగా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నా" అంటూ హరి చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



