బ్రహ్మముడి శ్రీకర్ కృష్ణ చిన్నింటి హోమ్ టూర్
on Feb 5, 2024
బ్రహ్మముడిలో శ్రీకర్ కృష్ణ తన సెకండ్ హౌస్ ని హోమ్ టూర్ చేసి చూపించాడు. చిన్నిల్లు పెద్దిల్లు అని అంటారు కాదా అంతా ఇది తన రెండో ఇల్లని చెప్పుకొచ్చాడు. ఐతే ఆ రెండు ..రెంటెడ్ హౌసెస్ అని పెద్దింట్లో వాళ్ళ అన్న, వదిన, పాప ఉంటారని వాళ్ళతో పేరెంట్స్ కూడా కలిసి ఉంటారని చెప్పాడు. ఇక రెండో రెంట్ హౌస్ లో తాను ఉంటానని చెప్పాడు. అలాగే అప్పుడప్పుడు తన ఇంటికి వాళ్ళ అమ్మా నాన్న వస్తారని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు తన పేరెంట్స్ ఉన్నారు కాబట్టి హోమ్ టూర్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
సగటు తెలుగు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది...హోమ్ టూర్ అంటే బాగా నీట్ గా క్లీన్ గా ఉంచుకుంటారు చాలా మంది కానీ తాను అలా ఉంచడం లేదని చెప్తూ తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో సోఫాలు, చైర్స్ కొన్నవి చూపించాడు. 55 ఇంచెస్ టీవీ దాని కింద ఉన్న టేబుల్ ని అమెజాన్ లో కొన్నా..నిజానికి శ్రీకర్ కృష్ణ హోమ్ టూర్ కంటే అమెజాన్ హోమ్ టూర్ అంటే బాగుంటుందేమో ఎందుకంటే అన్నీ అక్కడి నుంచి ఎక్కువగా కొంటూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇంట్లోకి పాములు రాకుండా పాములా బిహేవ్ చేస్తూ ఆక్సిజన్ ఇచ్చే స్నేక్ ప్లాంట్ ని కూడా కొన్నట్లు చెప్పాడు. అలాగే తన పేరెంట్స్ ని కూడా ఈ వీడియోలో చూపించాడు. అలాగే వాళ్ళ అమ్మ క్లాసికల్ డాన్సర్ అని ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో పాటు పిల్లలకు కూడా టీచ్ చేసేవారన్నారు. అలాగే తాను కూడా తన తల్లి దగ్గర కూచిపూడి నేర్చుకుని స్కూల్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చినట్లు చెప్పాడు శ్రీకర్ కృష్ణ. అలాగే తెలుగు పండిట్ కూడా చేసారని పిల్లల్ని ఎంత కంట్రోల్ చేస్తారో ఇంట్లో కూడా అలాగే తనని కంట్రోల్ చేస్తుంది అని అన్నాడు. తన మాటకారితనం, ఆ స్లాంగ్ అంతా తన తల్లి నుంచే వచ్చిందని చెప్పాడు. అలాగే తన తండ్రి మూడు వేదాలు చదువుకున్నారని అలాగే ఆస్ట్రాలజీ కూడా చెప్తారని మెడికల్ ఫీల్డ్ లో పని చేస్తారని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లి రకరాల ఫుడ్స్ ప్రిపేర్ చేయడంలో దిట్ట అన్నాడు శ్రీకర్ కృష్ణ. ఎవరైనా ఇంటికి వస్తే తప్పనిసరిగా రుచి చూపించే పంపిస్తానన్నాడు. స్క్రీన్ మీద ఇంత అందంగా కనిపించడానికి కారణం తన తల్లి చేసే స్పెషల్ ఫుడ్ అని చెప్పాడు శ్రీకర్. అలాగే తన ఇంట్లో ఉన్న డైనింగ్ గది, డైనింగ్ స్పేస్, దేవుడి గది, వాళ్ళ అమ్మ వాడే కుట్టు మిషన్, చిన్న బాల్కనీ కూడా చూపించాడు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)