నీతో నువ్వు ఒంటరిగా ఉండడం చాలా బెటర్!
on Jun 27, 2022
సోషల్ మీడియా శ్రీ ముఖి మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. ఎందుకంటే శ్రీముఖి ఏది చేసినా స్పెషలే. బ్లాక్ డ్రెస్ వేసినా వేల కొద్ది లైక్స్ వస్తాయ్. బుర్జ్ ఖలీఫాని చూపించినా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అలా వచ్చి పడతాయి. అందుకే శ్రీముఖిని సోషల్ మీడియా ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇక షూటింగ్స్ లేనప్పుడు సింగల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరు కదా. మరి శ్రీముఖి కూడా అదే సిట్యువేషన్ లో ఉందిప్పుడు. దాని మీద ఒక వీడియో చేసింది శ్రీ.
స్విగ్గిలో రా చికెన్ ఆర్డర్ చేసుకుని 'లెట్స్ సెలెబ్రేట్ ఏ లేజీ డే' అంటూ ఆ వీడియోలో ఎలా ఎంజాయ్ చేయాలో చూపించింది. లేజీ డే కాస్తా చికెన్ వచ్చేసరికి ఎక్సయిట్మెంట్ పెరిగి ఇంటరెస్టింగ్ డే అయ్యింది శ్రీముఖికి . ఇక చికెన్ ని చక్కగా వండేసింది శ్రీముఖి. మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ చేద్దామనుకుందట కానీ టొమాటోస్ లేవు కాబట్టి ఆనియన్స్ కోసింది. ఉల్లిపాయలు కొయ్యడం అంటే శ్రీముఖికి అస్సలు ఇష్టం ఉండదట. ఎందుకంటే కన్నీళ్లు వస్తాయని అంటోంది. ఇక కూర పొయ్యి మీదేసి వచ్చి డాన్స్ బేబీ డాన్స్ అంటూ డాన్స్ చేసేసింది.
'స్టేజి మీద కెమెరా ముందు డాన్స్ చేయడం ఒక లెక్క, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా డాన్స్ చేయడం ఇంకో లెక్కా ఆ కాన్ఫిడెన్సే వేరు' అంటూ మంచి హుషారుగా చెప్పింది శ్రీముఖి. "ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా, నీ లైఫ్ లో ఎవరున్నా లేకపోయినా, అసలేం జరిగినా అవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ ని, నీ జర్నీని ఎంజాయ్ చేయాలి. నిన్ను నువ్వు ప్రేమించాలి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏం చేయాలో రాసుకోండి, నచ్చింది వండుకుని తినండి, మంచిగా డాన్స్ చేయండి.. మీతో మీరు స్పెండ్ చేసే టైం దొరికిందని సంతోషపడండి ముందు" అంటూ చెప్పుకొచ్చింది హోమ్ అలోన్ వీడియోలో. 'పది మంది ఫేక్ పర్సన్స్ తో ఉండే బదులు నీతో నువ్వు ఒంటరిగా ఉండడం చాలా బెటర్' అంటూ తన వీడియో ద్వారా సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న విషయంపై మంచి మెసేజ్ ఇచ్చింది.