నన్ను తప్పుగా చూపించారు.. హోస్ట్ గా ఫాల్స్ న్యూస్ ని చెప్పాడు!
on Oct 4, 2024
బిగ్ బాస్ హౌస్ నుండి నాల్గో వారం ఎలిమినేషన్ అయిన సోనియా తన మొదటి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కొన్ని నిజాలని తను చెప్పింది. హోస్ట్ నాగార్జున గారి ముందు కూడా నేను మాట్లాడకపోవడానికి కారణం ఉంది. ఫస్ట్ వీక్‌లో నేను బాగా ఆడాను. రెండో వారం కూడా బాగా ఆడాను. వీకెండ్‌లో ఆయన వచ్చి.. సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు. నేను ఆయన వస్తారు.. ఆయన జడ్జిమెంట్ ఏమి ఇస్తారోనని ఎదురుచూసేదాన్ని. నాకు సెల్ఫ్ డౌట్ ఉండేది. ఫిజికల్ గేమ్‌లు కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాను కాబట్టి ఏమంటారా అని సెల్ఫ్ డౌట్ ఉండేది. కానీ ఆయన నా గేమ్ గురించి చెప్పకుండా నేను నిఖిల్‌పై అలగడం గురించి మాట్లాడారు. అది నిజం కాదు.. నేను నిఖిల్‌పై అలగలేదు. మీకు చూపించింది మొత్తం రాంగ్. నేను ఆరోజు ఫీల్ కావడానికి కారణం ఏంటంటే.. నేను నా కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. కానీ హౌస్‌లో వాళ్లంతా దాన్ని తినేశారు. అరే.. ఆమె తన కోసం స్పెషల్‌గా చేసుకున్నది కదా.. ఆమెకు ఉంచాలని ఒక్కరు కూడా నా కోసం ఆలోచించలేదు. నా ఇంట్లో నేనే ఫస్ట్ తింటా. అంతా నా కోసం రెడీ చేసి పెడతారు. ఎలా ఉండేదాన్ని ఎలా ఉన్నాను.. ఏంట్రా బాబూ అని నాకు ట్రిగ్గర్ అయ్యింది. నేను తినకుండా ఉండిపోయాను. నిజానికి నేను నిఖిల్‌ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అదే విషయం బ్రేక్‌లో సీతతో మాట్లాడుతుంటే.. ఆమె రివర్స్ అయ్యింది.
నిఖిల్ తరుపున నువ్వెందుకు మాట్లాడుతున్నావని అన్నది. ఆ తరువాత నాగ్ సర్ వచ్చి బ్రేక్‌కి వెళ్లొచ్చే లోపే గొడవా? అని అన్నారు. నిఖిల్ ని లేపి.. నీ తరుపున నువ్వు నిర్ణయం తీసుకోలేవా అని అడిగాడు. నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నేను ఇన్ ఫ్లూయెన్స్ చేయలేదు.. నిర్ణయం తీసుకున్నది నిఖిల్ అని సీతతో చెప్పడానికి పోతే.. ఆ ఫాల్స్ న్యూస్‌ని పొడిగించుకుంటూ పోవడం నాగార్జున సర్ ఎంత వరకు కరెక్ట్. వీకెండ్‌లో ఏదైతే జడ్జ్‌మెంట్ ఇస్తారో దానిపైనే నామినేషన్స్ చేస్తారు అలాంటప్పుడు నాగార్జున గారు.. కరెక్ట్‌గా చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పకపోయినా కనీసం సైలెంట్‌గా నైనా ఉండాలి. అంతే తప్ప ఫాల్స్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయకూడదు. తప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వకూడదు.. లేని తప్పుని తప్పని చెప్తే.. అదే కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ సర్దుకున్నా. కానీ నాలుగో వారం వచ్చి.. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని నాగార్జున సర్ అనేసరికి తట్టుకోలేకపోయా. నాకు అప్పుడు అర్థం అయ్యింది. వాళ్లు నన్ను ఎలా చిత్రీకరించాలని చూస్తున్నారో అలాగే చేస్తున్నారని సోనియా అంది.
నా రియాలిటీని వాళ్లు చూపించడం లేదని నాకు అర్థం అయ్యింది. అందుకే శనివారం ఎపిసోడ్ షూట్ తరువాత ఆదివారం ఎపిసోడ్ షూట్ కి కూడా నేను రెడీ అవ్వలేదు. నేను ఇక హౌస్‌లో ఉండలేను వెళ్లిపోతా అని ఫిక్స్ అయ్యా. ఈవారం ఎలిమినేట్ చేయకపోతే.. అభయ్‌లా ఏదోటి చేసైనా వెళ్లిపోవాలని అనుకున్నా. ఎందుకంటే నేను బిగ్ బాస్‌కి వెళ్లింది. నా రియాలిటీ ఏదో చూపించడానికి కానీ వాళ్లు.. తమకి నచ్చింది చూపిస్తున్నారు. నేను అడల్ట్ రేటెడ్ కామెడీ అన్నదాన్ని తీసుకొచ్చి ఫిజికల్ గేమ్‌కి లింక్ చేశారు. అసలు రెండింటికీ సంబంధమే లేదు. తడి కత్తితో గొంతు కోయడం నాకు రాదు. చెప్పే విధానాన్ని మార్చుకోవాలని అనుకున్నా కానీ.. కుదరడం లేదు. అవతల పర్సన్‌ని బట్టే నా రియాక్షన్ ఉంటుంది. ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను.. దిస్ ఈజ్ సోనియా ఆకుల.. నేను వద్దనుకున్నా కాబట్టే హౌస్ నుంచి బయటకు వచ్చా.. ఇప్పటికే నేనే బిగ్ బాస్ విన్నర్‌ని అంటూ సోనియా చెప్పుకొచ్చింది.
Also Read