కత్తిలాంటి నువ్వుండగా కత్తెందుకు చెప్పు?!
on Oct 19, 2021
ఈటీవీలో ప్రసారమవుతోన్న పాపులర్ షోస్‌లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. జబర్దస్త్ కమెడియన్లతో పాటు పలువురు టీవీ సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ ఉండే ఈ షోకు ఇంద్రజ గెస్ట్ సెలబ్రిటీగా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతున్నారు. ఈ నెల 24న ప్రసారమయ్యే ఎపిసోడ్లో బిగ్ బాస్ సెలబ్రిటీలు సొహేల్ ర్యాన్, దేత్తడి హారిక డాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్ కానున్నాయి. అలాగే దివ్యాంగుల, అనాథ బాలల ప్రదర్శనలతో ఈ ఎపిసోడ్ ప్రత్యేకతను సంతరించుకోనుంది.
'భీమ్లా నాయక్' గెటప్‌లో లుంగీ కట్టుకొని వచ్చిన సొహేల్, బైక్‌పై నిల్చొని చేసిన ప్రదర్శనకు అంతా స్టన్నయిపోయారు. ఇంద్రజ "ఏం స్టైలిష్ పర్ఫార్మెన్స్ అండీ మీది!" అని ప్రశంసించారు. "దిగు దిగు దిగు నాగో" పాటకు దేత్తడి హారిక చేసిన డాన్సు మతులు పోగొట్టింది. ఆ తర్వాత సొహేల్, హారిక కలిసి 'సీటీమార్' మూవీలోని పాపులర్ డ్యూయెట్ "జ్వాలారెడ్డి.. జ్వాలారెడ్డి.. తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో"కు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారిద్దరి ఎనర్జీకి అంతా ఫిదా అయిపోయారు.
ఇదే వేదికపై హారిక బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిపారు. టేబుల్ మీద కేక్‌ను చూస్తూ హారిక, "కేక్ ఉంది ఓకే. కానీ కేక్ కోయనీకి కత్తేదీ?" అనడిగింది. "కత్తిలాంటి నువ్వుండగా కత్తెందుకు చెప్పు!" అన్నాడు సొహేల్. "ఏ.. బిస్కేట్" అంటూ బ్యాగ్రౌండ్లో వినిపించింది. హారిక, "కానీ కేండిల్ ఏదిరా?" అని సొహేల్‌ను అడిగింది. పక్కనే ఉన్న హైపర్ ఆది, "నువ్వే కేండిల్ అంత ఉన్నావ్. మళ్లీ కొత్తగా కేండిల్ ఎందుకు?" అనడంతో అందరూ పడీపడీ నవ్వారు.
Also Read