ఆకాష్ నటనకు తల్లిగా గర్వపడుతున్నా...
on Jan 5, 2024
సర్కార్ నౌకరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను..ఆకాష్ నటనకు తల్లిగా గర్వపడుతున్నాసునీత చాలా ఎమోషనల్ అయ్యారు..తన సుపుత్రుడు ఆకాష్ నటించిన మూవీ "సర్కారు నౌకరీ" చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ మూవీ రీసెంట్ గా రిలీజై సక్సెస్ దిశగా అడుగులేస్తోంది. ఈ మూవీలో నటించిన ఆకాష్ సింగర్ సునీత ముద్దు బిడ్డ. ఇక తన నటన గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "ఈరోజు నేను నా బిడ్డను చూసి ఒక ప్రౌడ్ మదర్ గా ఫీలవుతున్నాను.
నటన బాగా చేసాడు. కథ నడిపించడం చాలా పెద్ద బాధ్యత..ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. ఎప్పుడూ యాక్ట్ చేస్తా యాక్ట్ చేస్తా అంటే ఏదో అనుకున్నా కానీ.. హీ ఈజ్ రియల్లీ గుడ్.. రాఘవేంద్ర రావు గారికి , శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మూవీ చూసి ఎమోషనల్ అవడం పక్కన పెడితే నా పిల్లలు కన్న కలలు నిజమవుతుంటే ఒక తల్లిగా కన్నీళ్లొస్తున్నాయి అంతే.. రాఘవేంద్ర రావు గారు ఇలాంటి బలమైన సబ్జెక్టు ని ఎంచుకున్నారు. శేఖర్ దాన్ని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఎక్కువ డ్రామా లేకుండా రియాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంచి సాంగ్స్, మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ని పలికించగలిగే నటులంటే నాకు చాలా ఇష్టం.. మూవీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమందిని చూసాను..చూస్తున్నాని. కానీ ఈ సినిమాని చూస్తున్నంత సేపు తాను ఆకాష్ నా కుమారుడు అన్న విషయాన్నే మర్చిపోయాను. సినిమా మొత్తం గోపాల్ అనే క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. తనకు ఏదైతే పని వచ్చిందో దాన్ని బాధ్యతగా నిర్వర్తించాడు. చాలామంది మూవీకి పబ్లిసిటీ చేయకపోతే థియేటర్స్ కి వచ్చి చూడరు అంటున్నారు కానీ మంచి సినిమా అన్నప్పుడు థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. రాఘవేంద్ర రావు గారికి ఎప్పటికీ మేమంతా రుణపడి ఉంటాం" అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు సునీత.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
