నాన్న కనిపిస్తే గట్టిగా కౌగిలించుకుని అరిచి ఏడవాలనుంది
on Mar 25, 2025
బుల్లితెర నటి భావన గురించి పరిచయం అక్కరలేదు. ఆమె బాలనటిగా కుట్ర అనే మూవీలో నటించింది. ఆ తర్వాత "భారతంలో బాల చంద్రుడు, లాయర్ సుహాసిని, రాజేశ్వరి కళ్యాణం" వంటి మూవీస్ లో నటించింది. బుల్లితెర మీద "సంధ్య" అనే సీరియల్ తో పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ సీరియల్స్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఐతే ఆమెకు మంచి మైల్ స్టోన్ సీరియల్ ఏదంటే "అందం". ఈ సీరియల్ ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. అలా ఆత్మ కథలు, పుత్తడి బొమ్మ , స్నేహ, నా మొగుడు నాకే సొంతం, భాగవతం, సీతామహాలక్ష్మీ లాంటి ఎన్నో సీరియల్స్ నటించింది ఇప్పుడు ఇంకా ఎన్నో సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అలాంటి భావన శ్రీదేవి డ్రామా కంపెనీలో అలరిస్తూ ఉంటుంది. ఈ వారం షోలో తన తండ్రి గురించి కూడా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది.
"నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందుకే అమ్మతోనే బాండింగ్ ఎక్కువ..నాన్నతో చాలా తక్కువ. నాన్న రైల్వే జాబ్ చేసేవారు. ఒకట్రెండు సార్లు నాన్నను వెళ్లి కలిసి ఉంటానేమో. ఆ తర్వాత కంప్లీట్ గా తమిళ్, తెలుగు మూవీస్ చేస్తుండడం వలన నాన్నతో అంత అటాచ్మెంట్ లేకుండా పోయింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు నాతో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళ ఫాదర్స్ ని తీసుకొస్తున్నప్పుడల్లా నాకు మా నాన్న అలా ఉంటే బాగుండు అనిపించేది..ఊహ తెలిసాక నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, మాట్లాడదాం అనుకునేసరికి నాన్న లేరు. ఇంత లైఫ్ స్టైల్ బాగున్నా నాన్న లేని లోటు అలాగే ఉండిపోయింది. నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు , వచ్చేటప్పుడు కానీ అవార్డ్స్ తీసుకున్నప్పుడు కానీ నాన్న ఎప్పుడూ లేరు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను పెంచింది. ఒక్కసారి నాన్న కనిపిస్తే గట్టిగా కౌగిలించుకుని అరిచి అరిచి ఏడవాలనుంది..ఇదిగో నీ కూతురు ఇలా ఉంది" అని చెప్పాలనుంది అంటూ ఎమోషనల్ వర్డ్స్ చెప్పింది నటి భావన.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
