అలనాటి అందాల నటిని ఏడ్పించిన అవినాష్
on Dec 26, 2022
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి అనే డాన్స్ షో రీసెంట్ గా బుల్లితెర మీద అలరించడానికి వచ్చింది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఈ షోకి జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, సదా, తరుణ్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. రాబోయే వారం షోలో జోడీస్ చేసిన పెర్ఫార్మెన్సెస్ అద్దిరిపోయాయి. ఇనాయ-రోల్ రైడా జోడి పర్లేదనిపించే పెర్ఫార్మెన్స్ చేసి చూపించింది. ఈ జోడికి ఆరియానా-అవినాష్ జోడి కలిసి 6 మార్క్స్ మాత్రమే ఇచ్చింది. ఫిమేల్ లిరిక్స్ రోల్ రైడా పాడేశాడు కాబట్టి ఈ మార్క్స్ ఇచ్చాం అని అవినాష్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసరికి మీ స్ట్రాటజీ నాకు అర్ధమవుతోందిలే అని ఇనాయ కౌంటర్ వేసింది. వెంటనే అవినాష్ లేచి నిలబడి నువ్వు ఇది బిగ్ బాస్ అనుకుంటున్నావ్..కానీ కాదు బీబీ జోడి..పాజిటివ్ గా మాట్లాడినప్పుడు పాజిటివ్ గా ఎలా రియాక్ట్ అవుతారో నెగటివ్ కూడా తీసుకోండి అన్నాడు..
తర్వాత ఆరియానా-అవినాష్ జోడి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. "రాధ గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి..ఎలా ఉన్నారు" అని అవినాష్ కృష్ణ గారి గొంతును ఇమిటేట్ చేసేసరికి రాధ ఏడుస్తూ "నేను ఆయన లేరు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను" అని కన్నీళ్లు తుడుచుకున్నారు.