
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-215 లో.. గంగ అన్నయ్యని రుద్ర చెంపదెబ్బ కొడతాడు. ఎందుకు కొట్టావని అడుగగా మన ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడాడు అని రుద్ర అంటాడు. ఏం అన్నాడని పెద్దసారు అడుగుతాడు. మన ఫ్యామిలీ అంతా కూర్చొని తినడమే తప్ప ఏం యూజ్ లేదని అన్నాడని రుద్ర అంటాడు. ఏంటే చెల్లి బావ ఇలా చేస్తున్నాడని గంగ వాళ్ళ మనసులో మాట్లాడుకోగా వాడుకోమ్మన్నావుగా వాడుతున్నాడు.. భరించు అని గంగ వాళ్ళ అన్నయ్యతో గంగ అంటుంది.
ఇంట్లో ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకుంటున్నారు కదా అని పెద్దసారు అనగానే సేమ్ టూ సేమ్ డైలాగ్ నేను అంటే వాడేమన్నాడో తెలుసా పెద్దనాన్న అని రుద్ర చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీరు సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేస్తుంటే మేము ఊరికే అలా పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నామట అని రుద్ర అంటాడు. దాంతో గంగ వాళ్ళ అన్నయ్య షాక్ అవుతాడు. ఎందుకు అలా అన్నావంటే మా చెల్లి కూడా అంది అని అతను అన్నాడని చెప్తాడు. ఏ అన్నావా అని పెద్దసారు అడుగగా.. అన్నాను ఎందుకంటే ఎవరి పనులు వారు చేయడం లేదు.. చిన్న అయ్యాగారు మీరు ఉన్నారని రిలాక్స్ అయ్యారు.. వంశీకి తను చదివే కాలేజీకి సంవత్సరానికి ఫీజు ఎంతో తెలియదు.. పెట్రోల్ కి ఎంత అవుతుందో తెలియదని అడుగగా.. అది చూసుకోవడానికి మేనేజర్ ఉన్నాడు కదా అని వంశీ అంటాడు.
ఇక సూర్య నువ్వు చేసే సివిల్ ఇంజనీరింగ్ జాబ్ లో ఎంతమంది ఆర్కిటెక్ లు ఉన్నారు.. నెలకి ఎన్ని ప్రాజెక్టు లు అవుతున్నాయని గంగ అడుగగా.. అవి చూసుకోడానికి అక్కడ వాళ్ళంతా ఉన్నారు.. ఇంకా ఏం అయినా డౌట్ ఉంటే చూసుకోడానికి అన్నయ్య ఉన్నాడుగా అని సూర్య అంటాడు. ఇక ఇషిక, వీరు కలిసి ఎన్నో ప్లాన్ లు వేస్తారు. అవేమీ నెరవేరవు.. వీరు చేసే బిజినెస్ లో బోలెడంత లాస్ వచ్చిందని గంగ అనగానే అది పెద్దదేమీ కాదు చిన్నదే రికవరీ అవుతుందని వీరు అంటాడు.
ఇషిక, వీరు, సూర్య, వంశీ, చిన్న అయ్యగారు ఇలా ఎవరు వారి పనులు వారు చేయడం లేదు.. నిర్లక్ష్యం ఉందని గంగ అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటావని పెద్దసారు అనగానే అందరికి తమ పనులు తామే చేసుకునేలా చేయాలి. ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటే బాగుంటుందని గంగ అంటుంది. అయినా ఎవరికి ఏం పనులు కావాలన్నా మా అన్నయ్యకి చెప్పండి ఎంతో నమ్మకంగా ఉంటాడని గంగ అనగానే గంగ వాళ్ళ అమ్నయ్య కంగారుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







