Jayam Serial : అమ్మాయిలని కాపాడిన గంగ, రుద్ర.. ఆ రింగ్ ఎవరిదంటే!
on Jan 30, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -180 లో.... జ్యోతిని వీరు వాళ్ళు కిడ్నాప్ చేసి ముంబైకి అమ్మేయాలని అనుకుంటారు. అలా చాలా మంది అమ్మాయిలని కిడ్నాప్ చేస్తారు. వీరు తన మొహాన్ని కవర్ చేసుకోవడానికి మాస్క్ పెడుతాడు. వాళ్ళు అందరు ఒక డెన్ లో ఉంటారు. అప్పుడే అక్కడికి రుద్రని తీసుకొని వస్తుంది గంగ.
అక్కడ రౌడీలు రుద్రని వెనకాల నుండి ఎటాక్ చేస్తారు. రుద్ర పడిపోతాడు. గంగని చూసి వీరుతో ఉండే పార్టనర్.. ఈ అమ్మాయి కూడా బాగుంది దీన్ని కూడా పంపించండి రా అని అంటాడు. గంగ కరెక్ట్ టైమ్ కి దొరికింది అని వీరు అనుకుంటాడు. గంగని తీసుకొని వెళ్ళిపోతుంటే రుద్ర స్పృహలోకి వచ్చి రౌడీలని కొడతాడు. అప్పుడే వీరు కత్తితో రుద్రని పొడవడానికి వస్తాడు. రుద్ర తన చేత్తో గట్టిగా ఆపుతాడు. వీరు రింగ్ కింద పడిపోతుంది. తన మాస్క్ తియ్యాలని రుద్ర చాలా ట్రై చేస్తాడు కానీ వీరు తప్పించుకుంటాడు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. అక్కడున్న వాళ్లంతా గంగ, రుద్రలకి థాంక్స్ చెప్తారు. ఇంట్లో అందరికి విషయం తెలిసి మొదట కంగారుపడుతారు. ఆ తర్వాత ఇద్దరిని మెచ్చుకుంటారు. వంశీ, సూర్య ఇద్దరు రుద్రతో మాట్లాడుతారు. ఎప్పుడు ఒక దెబ్బ తాకేసరికి ఇంకొక దెబ్బ అవుతుంది అన్నయ్య అని సూర్య అంటాడు. ఏం చేస్తాం ఆ గంగ వల్లే ఇదంతా అని రుద్ర వాళ్ళతో చెప్తుంటే గంగ వింటుంది.
గంగ అది విని అలుగుతుంది. రుద్ర కోసం తీసుకొని వచ్చిన సూప్ ని తనే తాగేస్తుంది. గంగ నేను ఏదో వట్టిగా అన్నాను కానీ నువ్వు ఈ రోజు చాలా మంచి పని చేసావని రుద్ర మెచ్చుకుంటాడు. ఆ తర్వాత వీరు తన చేతికి ఉన్న రింగ్ మిస్ అయిందని టెన్షన్ పడతాడు. మరొకవైపు గంగకి డెన్ లో రింగ్ దొరుకుతుంది. అది ఇంటికి వచ్చాక చూసి ఇది ఎవరిది అయి ఉంటుందని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



