మగాళ్లకు అండగా శేఖర్ బాషా...
on Nov 26, 2024
శేఖర్ బాషా ఆర్జేగా, వీజేగా, క్రికెట్ కామెంటేటర్ గా ఒకప్పటి ఆడియన్స్ కి, ఇప్పటి ఆడియన్స్ కి బాగా తెలుసు. 2007 నుండి 2019 వరకు మొత్తం 18 అవార్డులు అందుకున్న టాప్ ఆర్జే, విజెగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి శేఖర్ బాషా రీసెంట్ గ బిగ్ బాస్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. అలాంటి శేఖర్ బాషా ఇప్పుడు మగాళ్లకు అండగా నిలవాలని కోరుకుంటూ రకరకాల ఇంటర్వ్యూస్ లో మగవాళ్ళను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు.
"మగాళ్లు ఎలాగైనా బతికేస్తారు అనుకుంటున్నారు కానీ మగాళ్లు చాలా ప్రమాదంలో ఉన్నారు. అటు ఇంట్లో భార్యల వలన సమస్యలు పడే వాళ్ళు ఉన్నారు. పూలు తేలేదని, బయటకు తీసుకెళ్లలేదని కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరికీ తెలీకుండా టార్చర్ భరిస్తున్న మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి సరైన ప్లాట్ఫార్మ్ లేదు. చట్టం కూడా చాలామటుకు స్త్రీల పక్షానే ఉంది. వాళ్ళు చెప్తే కేసులు పెడతారు..అదే ఒక మగవాడు వెళ్లి ఇలా టార్చెర్ పెడుతోందంటూ కేసు పెడితే దాన్ని పట్టించుకోరు. ఎన్ని సంఘాలు పెట్టుకున్నా ఎన్ని ఫారంస్ పెట్టుకున్నా ఢిల్లీ పెద్దల నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. జానీ మాస్టర్ కేసును తీసుకుంటే ఆ లేడీ టార్చర్ చేస్తోంది అని జానీ మాష్టర్ రివర్స్ లో కేసు పెడితే రిజిస్టర్ కాదు ఎఫ్ఐఆర్ కూడా రాయరు. ఎందుకంటే ఈ సిస్టం ఇలా ఉంటుంది అనేది దగ్గరుండి చూసాను నేను. అందుకే మగవాళ్ళను అలెర్ట్ చేస్తూ వాళ్ళల్లో చైతన్యం నింపుతూ మగాళ్ల తరపున పోరాడాలని నిర్ణయించుకున్నా. నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఢిల్లీ వెళ్లి ఒక ప్లకార్డు అన్న చూపించి వస్తా అప్పుడు ప్రభుత్వానికి సమస్య అర్ధమవుతుంది. ఆడవాళ్లకు అనుకూలంగా సెక్షన్స్ ఉన్నాయని కేసులు పెడుతున్నారు కానీ వాళ్లకు తెలియకుండా ఎదుటి వాళ్ళ ఇంటి ఆడవాళ్లను, పిల్లలను రోడ్డున పడేస్తున్నారు. అందుకే ఢిల్లీ పెద్దలకు వినిపించేలా మాట్లాడాలని అనుకుంటున్నా" అన్నాడు విజె శేఖర్ బాషా.
Also Read