‘గుప్పెడంత మనసు’లో జగతి క్యారెక్టర్ని చంపేశారు!
on Oct 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -884 లో.. శైలేంద్ర అన్ని పెళ్లి పనులు చూసుకుంటున్నట్లు ఫణింద్ర ముందు బిల్డప్ ఇస్తుంటే.. అది చూసిన ఫణీంద్ర నిజమేనని అనుకుంటాడు. రిషి పెళ్లి పనులు దగ్గర ఉండి చూసుకుంటున్నావ్? నీకు రిషి అంటే ఎంత ఇష్టమోనని శైలేంద్రని అంటాడు. ఇష్టం కాదు ఇదంతా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు.
మరొక వైపు జగతి ఇచ్చిన తాళిని చూస్తూ రిషి మెట్లు దిగి కిందకి వస్తుంటాడు.. మరొక వైపు వసుధార కూడా కిందకి వస్తు.. ఇద్దరు ఒక చోట ఆగుతారు.. అప్పుడు వసుధార తన మనసులోనీ మాట రిషిని అడగాలి అనుకొని.. మీరు ఈ పెళ్లి మేడమ్ కోసం మాత్రమే ఒప్పుకున్నారు కదా అని అడుగుతుంది. నా మనసుని ప్రతి క్షణం అర్థం చేసుకుంటావ్, తెలుసుకుంటావ్ ఈ విషయం తెలియలేదా, నీకు తెలుసని రిషి అంటాడు. మా అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చి అమ్మ ఋణం తీర్చుకుంటానని రిషి అంటాడు. నేను మీ భార్య అయ్యాక మిమ్మల్ని మార్చుకొని మళ్ళీ రిషిధార అవుతాం సర్, ఆ నమ్మకం నాకు ఉందని వసుధార అనుకుంటుంది. మరొక వైపు జగతి దగ్గరికి రిషి వెళ్తాడు. నువ్వు ఎప్పుడు ఒక మంచి కొడుకుగా మీ డాడ్ ని చూసుకుంటావ్ కదా? నేను అవసరం ఉన్నప్పుడు మహేంద్ర పక్కన లేను, నువ్వు ఎప్పుడు మహేంద్రతోనే ఉండమని రిషి దగ్గర మాట తీసుకుంటుంది జగతి. దానికి రిషి సరే అంటాడు.
ఆ తర్వాత కాసేపటికి చక్రపాణి వస్తాడు. గతంలో తను జగతి పై ప్రవర్తించిన తీరు గుర్తుకు తెచ్చుకొని జగతి కాళ్ల మీద పడి.. క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత రిషి, వసుధార ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. రిషికి దేవాయని బాసిగం కడుతానంటే రిషి వద్దని.. తన తల్లి చేత కట్టించుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుందని రిషి అంటాడు. ఇక జగతి చేత రిషి బాసిగం కట్టించుకుంటాడు. ఆ తర్వాత వసుధారని.. నన్ను అత్తయ్య అని పిలువమని అనగానే.. వసుధారతో పిలమని రిషి చెప్తాడు. అలా చెప్పగానే అత్తయ్య అని జగతిని పిలుస్తుంది వసుధార. కాసేపటికి రిషి వసుధార మెడలో తాళి కడతాడు. ఫణీంద్ర, దేవయాని ఆశీర్వాదం తీసుకుంటారు. జగతి, మహేంద్ర ఆశీర్వాదం తీసుకుంటారు. జగతి హ్యాపీగా ఫీల్ అవుతు ఆశీర్వదిస్తుంది. అలా ఆశీర్వదిస్తుండగానే జగతి పడిపోతుంది. నర్సు వచ్చి జగతిని చూసి చనిపోయిందని చెప్పగానే.. రిషి, మహేంద్రలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read