నా బంగారం సుధీర్....మాది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అంటున్న రష్మీ
on Jan 8, 2025
బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరిదైనా ఉంది అంటే అది సుధీర్ - రష్మీ జంట లవ్ స్టోరీ. ఇది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వీళ్ళు కలిసి కనిపిస్తారు తెర మీద..కానీ జీవితంలో కలవనే కలవరు. ఐతే ఇప్పుడు వీళ్ళు తెరమీద కనిపించి ఆడియన్స్ కి కొంత సంతోషాన్ని అందించారు. "ఈ సంక్రాంతికి వస్తున్నాం" షోలో వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ప్రోమో స్టార్టింగ్ లో వచ్చిన శేఖర్ మాష్టర్ ని చూసి రష్మీ హాయ్ బావా అని పలకరించేసరికి "రష్మీ నీకు పెళ్లి చేద్దాం" అనుకుంటున్నాం అన్నాడు శేఖర్ . "బావా ఐనా ఇప్పుడు పెళ్లేంటి" అని చిరాగ్గా అడిగింది.
దానికి ఆది "కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా" అని అడిగాడు. "హా ప్రేమించా" అని చెప్పింది రష్మీ. "ఎవరా దరిద్రుడు" అని ఆది అడిగేసరికి టిప్ టాప్ గా సుధీర్ షో స్టేజి మీదకు వచ్చి నిలబడ్డాడు. రాగానే సుధీర్ ని చూసిన రష్మీ "నా బంగారం" అనేసింది. "నా బంగారం రష్మీ తాను లేకుండా నేను బతకలేను వెంటనే మా ఇద్దరికీ పెళ్లి చేసేయండి. నాకు ఇదొక్క డైలాగ్ ఇచ్చారు" అంటూ సుధీర్ పాఠం చదివేసి కాసేపు నవ్వించాడు. ఐతే ఈ షోలో ఆది సుధీర్ కి రష్మీకి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. "మీరిద్దరూ ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారు" అని అడిగాడు. దానికి సుధీర్ స్వర్గం అని రాస్తే రష్మీ అమీర్ పెట్ అని రాసింది. "అమీర్ పెట్ లో స్వర్గం ఉందా" అంటూ మధ్యలో రామ్ ప్రసాద్ అడిగాడు. "అలాంటి దేవత తిరుగుతుంది అంటే ఆ ప్లేస్ స్వర్గం అయ్యుంటాదండి" అన్నాడు సుధీర్. సుధీర్ ఆన్సర్ కి రష్మీ సిగ్గుమొగ్గలయ్యింది. "మీరిద్దరూ కలిసి ఫస్ట్ షేర్ చేసుకున్న గిఫ్ట్ ఏమిటి" అని మరో ప్రశ్న అడిగాడు ఆది. సుధీర్ మనసు అని రాస్తే రష్మీ రోజ్ ఫ్లవర్ అని రాసింది. "నేను ఆయనకు ఫ్లవర్ ఇచ్చాను ఆయన నాకు అది ఇచ్చారు" అంటూ రష్మీ చెప్పింది. "అది కాదు రోజ్ ఇచ్చినప్పుడు సుధీర్ ఎం చెప్పాడు అంటూ యాంకర్ పూర్ణ కన్ను కొడుతూ అడిగింది. "అదే చెప్పింది" అంటూ రష్మీ కూడా కన్ను కొట్టి మరీ ఆన్సర్ ఇచ్చింది. ఇక సుధీర్ రష్మీ జోడీని చూసాక నెటిజన్స్ ఆనందం ఐతే మాములుగా లేదు.
Also Read