రేవతిగారితో నటించిన మూవీ రిలీజ్ కాలేదు..
on Jul 5, 2025
సిల్వర్ స్క్రీన్ మీద రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో ఎన్నో రోల్స్ లో నటించాడు. ఆయన జర్నీ చాలా సుదీర్ఘమైనది. ఇప్పటికీ ఎన్నో మూవీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా అయన కాకమ్మ కథలో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చాను. నేను మెస్ లో భోజనం చేస్తున్నప్పుడు ఒకాయన వచ్చి ఇలా రేవతి గారితో ఒక మూవీ చేస్తున్నారు. హీరో కోసం వెతుకుతున్నారు. మీరు చేస్తారా అని అడిగారు. నేను హీరో ఏంటి అనేసరికి లేడు రండి అని నన్ను తీసుకెళ్లారు. మేము వెళ్లేసరికి డైరెక్టర్ గారు. అప్పట్లో నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. రెండో రోజు ఫోన్ చేసి పిలిస్తే వెళ్లాను. చూసి ఎవడ్రా నువ్వు అన్నారు. సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు కృష్ణ గారితో. నేనే సర్ రమేష్ ని అన్న. ఓరిని రమేష్ అరవింద్ అనుకున్న రమేషా నువ్వు అన్నారు. సరే బానే ఉన్నావ్ గాని రా అని రేవతి గారి దగ్గరకు తీసుకెళ్లారు. హీరోగా వీడు ఓకేనా అని అడిగారు. అప్పటికే ఆవిడ నేషనల్ అవార్డు అందుకున్న పెద్ద ఆర్టిస్ట్.
అంటే కొత్తవాళ్లతో చేస్తారా లేదా అని అడగడానికి తీసుకెళ్లారు. తర్వాత ఆవిడ తన క్యారక్టర్ బాగుంది అలాగే నేను కూడా బాగున్నాను అనేసరికి కెమెరా మ్యాన్ మధు అంబటి గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నన్ను చూసి ఇదేంటి ఇతను రేవతి గారి తమ్ముడిలా ఉంటాడుగా అన్నారు. నువ్వు ఉండవయ్యా ఆవిడ ఒప్పుకున్నారు ఎదో ఒకటి చెయ్యవయ్యా అన్నా. అలా సినిమా షూటింగ్ అయ్యింది. తర్వాత ఇక సినిమా అవకాశాలు వస్తాయి..ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటున్నా. మూవీ రిలీజ్ కాలేదు. రెండేళ్లు ఐపోయింది. రాఘవేంద్ర రావు గారికి ప్రివ్యూ వేసి చూపించారట. మా డైరెక్టర్ సినిమా ఎలా ఉంది అని అడిగేసరికి ఆయన ఎం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారట. దేవుడే నన్ను కాపాడాలి అని మా డైరెక్టర్ అనుకుంటే ఎస్ అని చెప్పి రాఘవేంద్రరావు వెళ్లిపోయారు. తర్వాత రామానాయుడు గారి దగ్గరకు వెళ్ళాడు మా డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ చేయడం నా వల్ల కాదు గాని కుర్రాడు బాగున్నాడు నా సినిమాలో వేషం ఇస్తాను సర్పయాగంలో వేషం ఇచ్చారు." అని చెప్పుకొచ్చాడు రాజా రవీంద్ర.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
