Brahmamudi : అప్పు, కళ్యాణ్ లని రాజ్ కనిపెడతాడా!
on Feb 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -958 లో......రాహుల్, రేఖ మాటలు విని ధాన్యలక్ష్మి హాల్లోకి వచ్చి గొడవ చేస్తుంది. ఆ కావ్య, రాజ్ ఇద్దరు నా కొడుకు కోడలిని కాపాడడానికి వెళ్ళలేదు.. రేవతి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.. ఎందుకంటే వాళ్లే కిడ్నాప్ చేశారు కాబట్టి అని ధాన్యలక్ష్మి అంటుంటే సుభాష్ తనపై కోప్పడతాడు. ఏంటి అన్నయ్య నా భార్య మీదకి అరుస్తున్నావని ప్రకాష్ అంటాడు. మరొకవైపు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని రుద్రాణి, రాహుల్, రేఖ ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటారు.
ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యండి ఎలాగైనా నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాలని రాహుల్, రేఖకి ఏదో ప్లాన్ చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్న వాళ్ళ పాపకి ఫీవర్ వస్తుంది. డాక్టర్ ఫోన్ చేస్తే త్వరగా హాస్పిటల్ కి తీసుకొని రమ్మని చెప్తుంది. రాహుల్ కి స్వప్న ఫోన్ చేసి పాపకి ఫీవర్ వచ్చిందని చెప్తుంది. అయ్యో స్వప్న నేను చాలా బిజీగా ఉన్నాను.. నువ్వు హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళు నేను అక్కడికి వస్తానని రాహుల్ చెప్తాడు. ఏంట్రా దానికి అంత భయపడుతున్నావని రుద్రాణి అనగానే మంచివాడిగా యాక్టింగ్ చెయ్యడం చాలా కష్టం మమ్మీ అని రాహుల్ అంటాడు. ఇంట్లో వాళ్ళు అందరు గొడవల్లో ఉన్నారు. దాంతో కావ్యకి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మంటుంది స్వప్న. కావ్య, రాజ్ కి స్వప్న విషయం చెప్పగానే ఇద్దరు హాస్పిటల్ కి బయల్దేరతారు. స్వప్న హాస్పిటల్ కి ఒక్కతే వెళ్తుంటే తోడుగా వస్తానని సుభాష్ వెళ్తాడు. పాపకి డాక్టర్ ట్రీట్ మెంట్ ఇస్తుంది. రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్లి సుభాష్ మాట్లాడతాడు. అసలు ఏమైంది ఏం జరుగుతుందని జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు.
రాత్రంతా అందరు హాస్పిటల్ లోనే ఉంటారు. పాపని తీసుకొని వెళ్ళమని డాక్టర్ చెప్తుంది. అప్పుడే రాజ్ కి తెలిసిన డిపార్ట్ మెంట్ అతను రాజ్ కి ఫోన్ చేసి మీరు పంపించిన ఫోన్ నెంబర్ ట్రేస్ చేసాం.. త్వరగా రమ్మని చెప్తాడు. కావ్య, రాజ్ ఇద్దరు లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ అప్పు, కళ్యాణ్ ఉండరు. అక్కడ ఎవరిదో ఒక ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ వీడియో తీసిన వాళ్ళది అయి ఉంటుందని అతను చెప్తాడు. ఈ ఫోన్ ద్వారా తెలిసిపోతుందని మళ్ళీ లొకేషన్ చేంజ్ చేశారని అతను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



