బన్నీ తల్లి కల్పలత కూతురి పెళ్ళిలో బుల్లితెర నటుల సందడి
on Dec 8, 2023
పుష్పలో అల్లు అర్జున్ కి మదర్ రోల్ లో నటించిన కల్పలత అందరికీ గుర్తుండిపోయే రోల్. ఎక్స్ప్రెషన్స్ తో ఎలాంటి సీన్ ని ఐనా పండించేస్తుంది. అలాంటి కల్పలతకు ఇద్దరు ఆడపిల్లలు. రూపశ్రీ, దేవిశ్రీ..వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరిలో ఒక కూతురు దేవిశ్రీ పెళ్లిని గత ఏడాది చేయగా ఇప్పుడు రూపశ్రీ పెళ్లిని ఘనంగా చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకకు బుల్లితెర నటులు సన, లలిత, మిర్చి మాధవి, రవి కిరణ్ వంటి సెలబ్రిటీస్ వచ్చి వధూవరులైన రూపశ్రీ-రోహిత్ ని విష్ చేశారు. సన ఈ మొత్తాన్ని ఒక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
పుష్ప మూవీతో పాపులర్ అవుతున్న కల్పలత తెలంగాణలోని ఖమ్మంజిల్లా మణుగూరులో పుట్టి పెరిగింది. పుష్ప మూవీకి ముందు ఆమె దాదాపు 55 చిత్రాల్లో , 10 సీరియల్స్ లో నటించారు. బాహుబలి,వివాహ భోజనంబు, అర్జున్ రెడ్డి, ఎక్ప్ ప్రెస్ రాజా, నేనే రాజు నేనే మంత్రి, భాగమతి, హిట్, గల్లీ రౌడి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో కూడా సందడి చేసింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన కల్పలత కు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎన్ని మూవీస్ లో నటించినా రాని గుర్తింపు పుష్ప మూవీలో తల్లి క్యారెక్టర్ కి వచ్చి ఆమె బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ పెళ్ళిలో కలిసిన బుల్లితెర నటులంతా ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకుని వెళ్లారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
