prithvi remuneration: బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ రెమ్యునరేషన్ ఎంతంటే!
on Dec 2, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియ గతవారం నుండే మొదలైంది. పన్నెండు వారాల వరకు వరుసగా తెలుగు కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్.. పన్నెండో వారం యష్మీని ఎలిమినేషన్ చేసి షాకిచ్చాడు. ఇక పదమూడో వారం శనివారం నాటి ఎపిసోడ్ లో టేస్టీ తేజని ఎలిమినేషన్ చేయగా, ఆదివారం నాటి ఎపిసోడ్ లో పృథ్వీని ఎలిమినేట్ అయ్యాడు.
కన్నడ బ్యాచ్ కి చెందిన పృథ్వీ ఎక్కువగా విష్ణుప్రియతో లవ్ ట్రాక్ నడిపాడు. అందుకే ఇప్పటి వరకు హౌస్ లో సర్వైవ్ అయ్యాడని అందరికి తెలుసు. ఇక హౌస్ లో 91 (అంటే 13 వారాలు) రోజులున్న పృథ్వీరాజ్.. రోజుకు రూ. 18,572 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే వారానికి రూ. 1లక్ష 30 వేలు అన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 13 వారాలకు గాను పృథ్వీరాజ్ రూ.16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే 13 వారాలకు గాను పృథ్వీరాజ్ శెట్టి రూ.19 లక్షల 50 వేలు తీసుకున్నట్లు కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ, విష్ణుప్రియల లవ్ ట్రాక్ చూసిన ఆడియన్స్.. ఏంట్రా బాబు మాకు ఈ కర్మ అనుకున్నారు. అయితే హౌస్ లో ప్రతీ ఒక్కరిని చిన్నచూపు చూడటం.. ఎవరికి కనీస మర్యాద ఇవ్వకపోవడం..ఫుల్ అగ్రెసివ్ గా ఆడటం.. రౌడీయిజం చేయడం.. ఇవన్నీ పృథ్వీ యొక్క ప్రత్యేకతలు.. ఇక గత వారం గౌతమ్ జరిగిన గొడవలో పృథ్వీ బొచ్చు విసిరేయడం పెద్ద చర్చనీయాంశమైంది.
Also Read