గూస్ బంప్స్ ఇచ్చిన ప్రేరణ ఓట్ అప్పీల్.. సీజన్-8 ఫీమేల్ విన్నర్!
on Dec 4, 2024
బిగ్ బాస్ సీజన్ లో ఆడపులి ఎవరంటే ఠక్కున ప్రేరణ అని చెప్తారు. తన అటతీరు అలా ఉంటుంది మరి. ప్రతి టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడుతుంది. ప్రేరణ కన్నడ నుంచి వచ్చినా తెలుగులో తనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. హౌస్ లో మొదట్లో ఒక గ్రూప్ వరకే ఉన్నా మెల్లిగా అందరితో కలవడం తనకి మరింత ప్లస్ అయింది.
ఫ్యామిలీ వీక్ తర్వాత తన గేమ్ ని మార్చేసింది ప్రేరణ. టాప్-5 లో ఉండడం మాత్రం పక్కా అనిపిస్తోంది. ఈ వారం ఓటు అప్పీల్ టాస్క్ గెలిచి సత్తా చాటింది. నిఖిల్ టాస్క్ లో ఉన్నాడంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. అలాంటిది నిఖిల్, ప్రేరణ, రోహిణి లు టాస్క్ ఆడగా ప్రేరణ గెలిచి ఓటు అప్పీల్ చేసుకుంది. ఓటు అప్పీల్ లో ప్రేరణ చెప్పిందంటే.. నా గురించి నాకే కొన్ని మంచి విషయాలు.. కొన్ని బ్యాడ్ విషయాలు తెలిశాయి.. ఆ బ్యాడ్ విషయాలు నేను సరిచేసుకుంటే నా లైఫే చాలా బావుంటుందని నేను నమ్ముతున్నాను.
ఇప్పటిదాకా పదమూడు వారాలు నేను సేవ్ అయ్యాను.. నా ఆడియన్స్ సపోర్ట్ వల్లే.. ప్లీజ్ చాలా దగ్గరిలో ఉన్నా ఫైనల్స్‌కి ఇలా మీ సపోర్ట్ మీ లవ్ ఓట్స్ నాకు కావాలి.. ఇప్పుడు ఒక్క నామినేషన్ ఉంది.. అది దాటేస్తే ఇక ఫైనల్స్.. ఆ విన్నర్‌కి చాలా దగ్గరిలో ఉన్నాను.. మీ సపోర్ట్ మీ ఓట్స్ నాకు ఇవ్వండి.. మీందరూ గర్వపడేలా చేస్తాను.. బిగ్‌బాస్ సీజన్ 8.. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలని గట్టిగా ఆశ ఉంది.. అది మీ సపోర్ట్ వల్లే అవుతుంది.. నాకు సపోర్ట్ చేయండి.. ఓట్ చేయండి.. మీ ప్రేమ ఇవ్వండి.. నేను కూడా నా బెస్ట్ ఇస్తా.. ఓటు మీది గెలుపు నాది.. నేను ఫన్‌గా నాలాగా క్రేజీగా ఉంటా ఈ టూ వీక్స్.. ఎంజాయ్ చేద్దాం.. ఓట్ చేయండి ప్లీజ్.. అంటూ ప్రేరణ రిక్వెస్ట్ చేసింది.
Also Read