Illu illalu pillalu : గుడిలో ఎంగేజ్ మెంట్ చేస్తున్న భాగ్యం.. కొడుకు రాలేదని వేదవతి బాధ!
on Mar 28, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -117 లో.....రామరాజు తన కుటుంబంతో గుడికి వస్తాడు. భాగ్యంకి ఫోన్ చేసి ఫంక్షన్ హల్ ఎక్కడో చెప్పండి అని రామరాజు అడుగుతాడు. మీరు అయితే ముందు గుడి లోపలికి రండీ అంత చెప్తానని భాగ్యం అంటుంది. ఫంక్షన్ హల్ ఎక్కడో చెప్పమంటే లోపలికి రమ్మంటుంది ఏంటని రామరాజు అనుకుంటాడు. అందరు లోపలికి వస్తారు.. లోపలికి వెళ్ళగానే ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు. ఎంగేజ్ మెంట్ ఇక్కడే అని భాగ్యం అంటుంది. అదేంటీ ఫంక్షన్ హల్ లో గ్రాంఢ్ గా చేస్తామన్నారు కదా అని వేదవతి అంటుంది.
చెయ్యడానికి మాకేం ప్రాబ్లమ్ లేదు కానీ వచ్చిన వాళ్లంతా మీకూ కాబోయే అల్లుడు మర్డర్ కేసులో స్టేషన్ కి వెళ్ళాడట కదా అంటుంటే బాగోదు కదా అందుకే మాకు పరువుతో సంబంధం లేదు ఎంగేజ్ మెంట్ గ్రాంఢ్ గా కావాలని అంటే ఇప్పుడే ఫంక్షన్ హల్ కి వెళదామని భాగ్యం అంటుంది. దాంతో ఇక్కడే జరిపించండి అని రామరాజు అంటాడు. ఎంగేజ్ మెంట్ కి ధీరజ్ లేడని వేదవతి పక్కకి వెళ్లి బాధపడుతుంది. రామరాజు ఏమైందని అడుగుతాడు. పెద్దోడి ఎంగేజ్ మెంట్ కి చిన్నోడు లేడు నా బాధకి కారణం మీరే అని రామరాజుపై వేదవతి కోప్పడుతుంది. నాకు మాత్రం బాధ ఉందా కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతుందని ఇలా రావద్దని చెప్పానని రామరాజు అంటాడు.
ఆ తర్వాత ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ రాలేదని బాధపడుతుంది. అప్పుడే నర్మద వచ్చి నువ్వు చాలా చేంజ్ అయ్యావ్.. ఈ మధ్య ధీరజ్ గురించి ఆలోచిస్తున్నావు అంటుంది. మరొకవైపు సాగర్, చందు, ఇద్దరు ధీరజ్ రాలేదని బాధపడతారు. ధీరజ్ చందు ఎంగేజ్ మెంట్ కి రాలేదని బాధపడతాడు. అప్పుడే వాటర్ క్యాన్ లు గుడిలో వెయ్యమని ఓనర్ ధీరజ్ తో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
