Illu illalu pillalu : అమూల్య పెళ్లిని ఆగిపోయేలా చేస్తానన్న భద్రవతి.. వేదవతి హ్యాపీ!
on Jan 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -374 లో.. అమూల్యతో రామరాజు ప్రేమగా మాట్లాడుతాడు. అమూల్య ఒంటరిగా కూర్చొని వాళ్ళ నాన్న అన్నమాటలు గుర్తుచేసుకుంటుంది. అప్పుడే ముగ్గురు అన్నవదినలు వచ్చి తన చుట్టూ చేరుతారు. నువ్వు అత్తారింటికి వెళ్తుంటే మాకు బాధగా ఉందని ముగ్గురు అన్నలు ఎమోషనల్ అవుతారు. చెల్లి కోసం చీర తెచ్చాను తీసుకొని రా అని వల్లికి చందు చెప్తాడు. నేను కూడా నెక్లెస్ తెచ్చానని ధీరజ్ అంటాడు. మరి నువ్వు ఏం తీసుకొని రాలేదా సాగర్ అని వల్లి అడుగుతుంది. సాగర్ సైలెంట్ గా ఉంటాడు మేం ఏం ఇచ్చినా కలిసే ఇస్తామని చందు అంటాడు. ముగ్గురు తోటికోడళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళు తీసుకొని వచ్చినవి తెస్తారు.
సాగర్ కి తెలియకుండా అమూల్య కోసం రింగ్ ఇస్తుంది నర్మద. దాంతో సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముగ్గురు తెచ్చిన వస్తువులు అమూల్యకి ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కామాక్షి ఎంట్రీ ఇస్తుంది. నాకేం ఇవ్వరా అని అడుగుతుంది. అందులో తిరుపతి కలుగజేసుకొని ఫన్ గా మాట్లాడుతాడు. అమూల్య అంటే మీకే కాదు. నాక్కూడా ఇష్టమని కామాక్షి అంటుంది. అందరు సరదాగా ఉంటారు. తన అన్నయ్యలు ఇచ్చిన గిఫ్ట్ చూసి అమూల్య మురిసిపోతుంది. ఇంత ప్రేమని నేను వదులుకొను విశ్వని పెళ్లి చేసుకుంటే వెళ్ళందరి ప్రేమ మిస్ అవుతాను.. నాకు విశ్వ వద్దని అమూల్య అనుకుంటుంది. తన గదిలో ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్ కన్పించడం లేదని వేదవతిని అడుగుతుంది. ఇద్దరు కలిసి వెతుకుతారు. అమూల్యకి రింగ్ దొరుకుతుంది. దాన్ని చూసి అమూల్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్న రింగ్ ఇస్తే కేర్ లెస్ చేసావ్.. ఈ రోజు ఏంటని వేదవతి అడుగుతుంది. ఇది నాన్న పరువు అని అర్థమైంది.. నాన్న పరువు తీసే పని ఎప్పుడు చెయ్యను అమ్మ అని అమూల్య అనగానే వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు భద్రవతి ఇంటికి వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్ళు భయపడుతారు. ఈవిడ ఇప్పుడు వచ్చింది ఏంటి.. మనం అనుకున్నది చేస్తానని భద్రవతితో విశ్వ అనగానే ఎవరు వచ్చినా చేస్తామని భద్రవతి అంటుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ లని శుభలేక సెలెక్ట్ చెయ్యడానికి రామరాజు పంపిస్తాడు. ఆ తర్వాత అమూల్యకి విశ్వ ఫోన్ చేస్తే అమూల్య కట్ చేస్తుంది. దాంతో శ్రీవల్లికి ఫోన్ చేసి అమూల్యకి ఇవ్వమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



