Illu illalu pillalu : అమూల్య లేదని తెలుసుకున్న కొడుకులు, కోడళ్ళు.. విశ్వ తాళి కడతాడా!
on Jan 30, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -381 లో..... అమూల్య పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. తెల్లవారితే పెళ్లి అనగా అమూల్యని కిడ్నాప్ చేస్తాడు విశ్వ. ప్రేమ అందంగా రెడీ అయి వస్తుంటే.. ధీరజ్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంట్రా అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందా అని ప్రేమ అంటుంది. అదేం లేదని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత రేయ్ విశ్వ నన్ను వదిలేయ్ అక్కడ మా నాన్న పరువుపోతుందని అమూల్య అంటుంది. ఎక్కడికే వెళ్ళేది.. పరువు పరువు అంటున్నారు కదా.. ఇక మీ నాన్న పరువు పోయినట్లే అని విశ్వ అంటాడు.
నీ మెడలో వాడు తాళి కడితే పరువు ఉంటుంది. అదే నేను కడితే పరువుపోతుంది.. లేచిపోయిందని అంటారని విశ్వ అంటాడు. మరొకవైపు తిరుపతి వాళ్ళు ఇంట్లో సందడిగా డాన్స్ చేస్తుంటారు. శనగపిండి తీసుకొని రా అని నర్మద, ప్రేమకి కామాక్షి చెప్తుంది. ఎందుకు వదిన అని నర్మద అడుగుతుంది. నా చెల్లికి నలుగు పెట్టాలని కామాక్షి అంటుంది. అమూల్య కోసం గదిలోకి వెళ్తుంది నర్మద. అక్కడ అమూల్య లేకపోవడంతో నర్మద షాక్ అవుతుంది. అదే విషయం వచ్చి ప్రేమతో చెప్తుంది. ఇద్దరు అమూల్య ఎక్కుడ ఉందని ఇంట్లో అంతా వెతుకుతారు.
అప్పుడే సాగర్, ధీరజ్ చందు వస్తారు. వాళ్లకి కూడా విషయం తెలిసి టెన్షన్ పడుతారు. ఇక శ్రీవల్లి ఏం తెలియనట్లు యాక్టింగ్ చేస్తుంది. ఇదంతా ఆ విశ్వ గాడి పని అయి ఉంటుందని ముగ్గురు అన్నాతమ్ముళ్లు కలిసి భద్రవతి ఇంటికి వెళ్లి గొడవచేస్తారు. మీ చెల్లి లేకపోతే ఇక్కడికి వచ్చారేంటి.. ఎవడితో లేచిపోయిందో ఏంటో.. వెళ్లి బస్టాండ్ రైల్వే స్టేషన్ లో వెతకాలి కానీ నాలాంటి వాళ్ళ ఇంటికి వస్తారా అని భద్రవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



