సైకిల్ తెస్తానన్నారు...కానీ శవమై వచ్చాడు నాన్న ....
on Mar 25, 2025
ప్రసాద్ బెహరా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా విన్పిస్తున్న పేరు. షార్ట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాగే బుల్లితెర మీద షోస్ కి వస్తున్నాడు. ఇక రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చాడు. ఐతే ఈ షోలో బాగా ఎమోషనల్ అయ్యాడు. వాళ్ళ నాన్నను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రష్మీ అతనికి వాళ్ళ నాన్న ఫోటోని ప్రెజెంట్ చేసింది. ఇక ఆ ఫోటో చూసాక ప్రసాద్ బెహరా తన నాన్న గురించి చెప్పుకొచ్చాడు. "నాన్న అనే ఎమోషన్ నాకు చాలా తక్కువ..ఎందుకంటే నాకు మూడేళ్లున్నప్పుడే ఆయన చనిపోయారు. ఆయనతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. వైజాగ్ లోని అచ్చాపురం అనే ఊర్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఎదురుగా ఒక పిల్లాడు నా వయసు వాడే ఉండేవాడు. అతనికి వాళ్ళ నాన్న సైకిల్ ఇచ్చాడు.
నేను మా నాన్నను కూడా అదే అడిగాను. మన ఇంట్లో పెద్ద సైకిల్ ఉంది కదా దాన్ని చిన్న సైకిల్ చేయించి ఆఫీస్ నుంచి రాగానే పట్టుకొస్తాను అన్నాడు. చాల రోజులు వెయిట్ చేశా నాన్న వచ్చేవాడు కానీ సైకిల్ వచ్చేది కాదు. కానీ ఒక రోజు అలాగే నాన్న కోసం వెయిట్ చేస్తున్నా కానీ నాన్న రాలేదు ఒక జీప్ వచ్చి ఆగింది...అందులో మా నాన్న బాడీ ఉంది. ప్రతీ అప్లికేషన్ లో లేట్ అని నాన్న పేరు ముందు రాసినప్పుడు నాన్న ఉంటే బాగుండేది అనిపించేది. దేవుడు ఐదు సెకన్లు వరమిచ్చి నా దగ్గరకు మా నాన్నను పంపిస్తే ఉండిపొమ్మని చెప్తాను." అంటూ తన ఆవేదన మొత్తం చెప్పుకొచ్చాడు. మెగా డాటర్ నీహారిక నటించిన కమిటీ కుర్రాళ్ళు అనే మూవీలో ప్రసాద్ బెహరా నటించాడు. అలాగే అంతకు ముందు పెళ్ళివారమండి అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది మూడు సీజన్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ద్వారా విజయం అందుకున్న ప్రసాద్ బెహరాకు అవకాశం ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేసింది నిహారిక.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
