Home

»

Tv News

మహా ఆఫీస్‌లో చక్రి అత్యుత్సాహం.. కోపంతో ఊగిపోయిన భార్య!

Jun 14, 2026 11:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ ఇప్పటికే 135 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇందులో నారాయణ కుటుంబం, ప్రతాప్ కుటుంబం ప్రధానంగా ఉంటాయి. ప్రతాప్ బాగా డబ్బున్న వ్యక్తి. అతని ఏకైక కూతరు మహా.. ఒక సాధారణ కార్ డ్రైవర్ అయినటువంటి చక్రిని పెళ్ళి చేసుకుంటుంది. అక్కడి నుండి కథ ఆసక్తికరంగా మారింది.  ఇక గత ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. నారాయణ వాళ్ళు మహా కోసం కొత్తగా వాష్ రూమ్ కడుతూ ఉంటే నారాయణ చేతికి గాయం అవుతుంది. అది చూసిన మహా బాధపడి.. కన్నాని సారీ చెప్పమని అడుగుతుంది. మీ నాన్నకు గాయమైంది, నీ వల్లే కాబట్టి వెళ్లి సారీ చెప్పమని కన్నాతో మహా చెప్తుంది. కానీ కన్నా వినకుండా, అసలు ఆయన్ని నాన్న అని కూడా పిలవను.. రోడ్డున వెళ్లే వ్యక్తితో సమానమంటూ కన్నా కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని మహా దగ్గరకు వచ్చి కన్నా సారీ చెప్తాడు. తర్వాత మహా ఇంట్లో అందరి కోసం బిర్యానీ వండుతుంది. అయితే ఆ బిర్యానీ తింటే ఎక్కడ తన కన్నతల్లి గురించి మహా నిజాలు అడిగి తెలుసుకుంటుందోనని భయపడి నారాయణ ఇంట్లోకి వెళ్ళడానికి సంకోచిస్తాడు. కానీ మహానే స్వయంగా బిర్యానీ తెచ్చి నారాయణకి ఇవ్వడంతో.. నిజం రాబట్టాలని చూస్తున్నావు కదా.. అది అస్సలు జరగదని మనసులో అనుకుంటాడు నారాయణ.

మరోవైపు కేశవ, శైలు మధ్య లవ్ డ్రామా సాగుతుంది. శైలును ఆపడానికి ఆమె చేయి పట్టుకుంటాడు కేశవ. దానికి శైలు.. నేనేమైనా నీ పెళ్లాన్నా, లవర్‌నా.. నా చేయి పట్టుకున్నావంటూ క్లాస్ పీకుతుంది. మరోవైపు మహా ఆఫీస్‌కు వెళ్లి అందరితో సరదాగా గడుపుతుంది. విక్కీతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని విక్కీ అడుగుతాడు. కానీ మహా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తుంది. చక్రి మహాకు ఫోన్ చేసినప్పుడు.. అదే సమయంలో సంతోష్ ఆఫీసులో వేరే ఎవరితోనో గొడవపడుతుంటాడు. ఆ గొడవను ఫోన్లో విన్న చక్రి.. ఎవరో మహాని తిడుతున్నారని తప్పుగా అర్థం చేసుకుంటాడు. వెంటనే మహా ఆఫీస్‌కు వెళ్ళి.. మహాని తిట్టింది ఎవరంటూ రచ్చ చేస్తాడు. అందరి ముందు చక్రి అలా ప్రవర్తించడంతో మహా తీవ్రంగా అవమానంగా ఫీల్ అవుతుంది. నా తల తీసేశావంటూ చక్రిపై కోప్పడుతుంది.

ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా కన్నా ప్రవర్తన, శైలు కోపం, నారాయణ దాస్తున్న నిజాలు మరియు చక్రి చేసిన పొరపాటు వల్ల ఆఫీసులో మహా పడిన అవమానం చుట్టూ కథ నడిచింది. చక్రి రచ్చ చేసిన తర్వాత ఆఫీసులో ఏం జరిగిందనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com