Home

»

Tv News

Podharillu: విడాకుల దిశగా మహా-చక్రి ప్రయాణం.. కేశవకు తెలిసిన అసలు నిజం!

Mar 18, 2026


స్టార్ మా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'పొదరిల్లు' సీరియల్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. ఈ సీరియల్ మంగళవారం నాటి తాజా ఎపిసోడ్-72లో.. తన వదిన ఇచ్చిన సలహాతో విడాకుల కోసం లాయర్ దగ్గరికి చక్రిని తీసుకొని వెళ్తుంది మహా. లాయర్ కి తన విడాకుల గురించి మహా చెప్తుంది. కేవలం రెండు నెలలకే మీకు విడాకులు ఎందుకంటూ లాయర్ అడుగుతాడు. ఇక  మహా, చక్రిల పెళ్ళి పోలీస్ స్టేషన్‌లో జరిగిందని తెలుసుకుంటాడు లాయర్. ఆధార్ కార్డు లేనిదే ఆ పెళ్లి ఎలా జరిగిందని లాయర్ అడగడంతో మహాకు అనుమానం మొదలవుతుంది. ఆధార్ కార్డు తీసుకురావాలని లాయర్ సూచించడంతో మహా, చక్రి అక్కడి నుండి వెనుదిరగాల్సి వస్తుంది.

విడాకుల విషయం సీరియస్ అవుతుండటంతో చక్రి ఒక ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా మహా తనను వదిలి వెళ్లకుండా ఉండాలని, గతంలో తమకు పెళ్లి చేసిన కానిస్టేబుల్‌ను కలిసి సహాయం కోరతాడు. విడాకులు ఆగిపోయేలా చూడాలని చక్రి రిక్వెస్ట్ చేయడంతో, కానిస్టేబుల్ రంగంలోకి దిగి మహాకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీయడం కథను మరిన్ని మలుపుల వైపు తీసుకెళ్తోంది.

ఇక ఈ గొడవలన్నీ ఒకవైపు అయితే చక్రి మరియు మహా మధ్య జరుగుతున్న ఈ విడాకుల డ్రామా కేశవ వింటాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరు విడిపోవాలనుకుంటున్నారనే నిజాన్ని కేశవ వినడంతో, ఇంట్లో పెద్ద దుమారమే రేగేలా కనిపిస్తోంది. నిజం తెలిసిన కేశవ ఎలా స్పందిస్తాడు.. మహా తన పంతం నెగ్గించుకుంటుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లలో చూడాల్సిందే.

ప్రస్తుతం బుల్లితెరపై 'పొదరిల్లు' సీరియల్ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా అలరిస్తోంది. పెళ్లి తర్వాత వచ్చే ఇగో సమస్యలు, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే ఈ కథనం సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా చక్రి పాత్రలో నటుడు చూపిస్తున్న వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

వచ్చే ఎపిసోడ్లలో మహాకు ఆధార్ కార్డు విషయంలో ఉన్న సందేహాలు తీరుతాయా లేదా చక్రి వేసిన ప్లాన్ సక్సెస్ అయి విడాకులు ఆగిపోతాయా అన్నది వేచి చూడాల్సిందే. మహా నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com