Home

»

Tv News

Podarillu Serial: చక్రిని ఆడుకున్న మహా.. మాధవ,మనీషా లాంగ్ డ్రైవ్!

Nov 5, 2026 9:08AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -252 లో.. చక్రి టార్చర్ తోనే సాగింది. మహా చెప్పడంతో మాధవ 50 పర్సెంట్ మాత్రమే వడ్డిస్తాడు. తను అమాయకుడినని చక్రి అంటున్నా మహా వినదు. కేశవకు శైలు అనే ఖాతా ఉన్నట్లే సర్ కు చాలా ఖాతాలు ఉన్నాయని మహా సెటైర్ వేస్తుంది. అప్పుడే కస్టమర్ కళ్యాణి చక్రికి ఫోన్ చేసి రొమాంటిక్ గా లాంగ్ డ్రైవ్ కు వెళ్దామా అని అడుగుతుంది. అది స్పీకర్ లో విన్న మహా ఛీ అంటూ వెళ్లిపోతుంది. మాధవ, కేశవ, కన్నా కూడా ఛీ ఛీ అంటూ వెళ్తారు. మరుసటి రోజు ఉదయమే చక్రిని మహా తెల్ల బట్టలు వేసుకొని పిచ్చుక గూడుపై స్నానం చేసి రెడీ అవ్వమని, గుడిలో తన పేరిట పూజ చేయిస్తానని ఆర్డర్ వేస్తుంది. పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలని, వన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లేదని తేల్చి చెప్తుంది.

గుడిలో పంతులు కూడా చక్రితో ఆడుకుంటాడు. వెధవ అంటూ తిట్టి, అరచేతిలో హారతి పెట్టి ప్రమాణం చేయాలని చెప్తాడు. మాధవ కాయిన్ పై కర్పూరం పెట్టి హారతి వెలిగిస్తే చక్రి ఇక నుంచి తప్పు చేయనని, అందరు అమ్మాయిలు తన సిస్టర్స్ అని ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత 27 ప్రదక్షిణలు, మూడు సార్లు పొర్లుదండాలు పెట్టాలని పంతులు చెప్పడంతో చక్రి లెంపలేసుకుంటూ గుడి చుట్టూ తిరుగుతాడు. అక్కడ కూడా ఓ అమ్మాయికి కొబ్బరికాయ ఎలా పగలగొట్టాలో నేర్పిస్తూ బాగోతం చేస్తాడు. అది చూసిన మహా, మాధవ వీడు మారడని అనుకుంటారు. కానీ చివరికి ఆ అమ్మాయి వచ్చి థ్యాంక్స్ అన్నయ్య అనడంతో అందరు నవ్వుతారు. ఇంటికి వచ్చాక 45 వేల సెకన్లుగా తినలేదని చక్రి ఆకలితో అలమటిస్తాడు.

మాధవ వంట చేస్తాననడంతో చక్రి సంతోషిస్తాడు. కానీ మనీషాతో లాంగ్ డ్రైవ్ ఉందని కేశవ గుర్తుచేయడంతో షాక్ అవుతాడు. లాంగ్ డ్రైవ్ అంటే ఏంటని మాధవ అడిగితే మనీషాను బైక్ పై దూరంగా తీసుకెళ్లడమేనని మహా చెప్తుంది. మొదట తెల్ల బట్టలతో వచ్చిన మాధవను చూసి అందరు నవ్వగా.. కన్నా అతన్ని స్టైలిష్ గా మార్చి తీసుకొస్తాడు. షూస్, గాగుల్స్ తో స్టైలిష్ లుక్ లో మాధవ బైక్ తీసుకొని మనీషా దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు చెరువు గట్టుపై మాట్లాడుకుంటుండగా మనీషా బావ పంపిన రౌడీలు ఆమె ఫొటోతో అక్కడికి వచ్చి ఆరా తీస్తారు. మాధవతో మనీషాను చూసి గొడవకు దిగబోతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com