Podarillu: పెళ్ళి షాపింగ్ కి మహా.. గాయత్రీ, మాధవ కలుస్తారా?
on Dec 16, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -06 లో... ఎవరైనా ఆడవాళ్లు వెంట లేకుండా పెళ్లిచూపులకి వెళ్తారా అని నారాయణ అంటాడు. ఆడవాళ్లని తీసుకొని వస్తే నువ్వు సెట్ చేసుకోవచ్చనా అని చక్రి అనగానే అలా అంటావేంట్రా మీ అమ్మ మీద ఒట్టు అలాంటిదేం లేదని నారాయణ అంటాడు. తాగనని రోజు అమ్మ ఫోటోపై ఒట్టు వేస్తున్నావ్.. మారుతున్నావా అని చక్రి అంటాడు. అన్నయ్య నిన్న ఆ అమ్మాయి చెయ్ పట్టుకున్నావ్ కదా అని మాధవని తన తమ్ముళ్లు ఆటపట్టిస్తారు.
మరొకవైపు అబ్బాయికి నువ్వు బాగా నచ్చావట అని ప్రతాప్ వచ్చి మహాకి చెప్తాడు. నాకు ఇష్టం లేదని మహా అంటుంది. మంచి సంబంధం మన కమ్యూనిటీలో ఇలాంటి సంబంధం ఎవరు తీసుకొని రాలేదని ప్రతాప్ అంటాడు. మావయ్య గారు తన ఇష్టం కూడా ఉండాలని హారిక అంటుంటే.. నీకేం తెలియదని ఆదిత్య అంటాడు. అసలు మాకంటూ కలలు ఉండవా అని మహా అంటుంది. ప్రతాప్, మహాని కన్విన్స్ చేస్తాడు.
మరొకవైపు మాధవ మార్కెట్ నుండి ఇంటికి వస్తుంటే.. గాయత్రి కలిసి మాట్లాడుతుంది. అప్పుడే తాయారు వచ్చి మాధవని తిట్టి గాయత్రిని లాక్కేలుతుంది. అదంతా కేశవ చూస్తాడు. నువ్వు ఇంకొకసారి వాడితో మాట్లాడితే మర్యాదగా ఉండదని తాయారు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే తాయారు భర్త ఫోన్ చేస్తాడు. నువ్వు పిల్ల పెళ్లికి కావలసిన డబ్బులు సంపాదించాకే దుబాయ్ నుండి రావాలని తాయారు చెప్తుంది.
మరొకవైపు మహా దగ్గరికి ప్రతాప్ వస్తాడు. నేనంటే మీకు ఇష్టం కదా నన్ను ఎందుకు కెనడా పంపిస్తున్నారు. నన్ను అతను అర్థం చేసుకోలేదని మహా అంటుంది. రేపు పెళ్లి షాపింగ్ కి వెళ్తారు కదా అప్పుడు అర్థం చేసుకోమని ప్రతాప్ అంటాడు. నువ్వు చాలా లక్కీ మంచి ముహూర్తం కూడా సెట్ అయింది. ఇక రేపు షాపింగ్ నగలు తీసుకోవాలని మహా వాళ్ళ అమ్మ అంటుంది. దాంతో మహా టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



