Podarillu: మహా పెళ్ళికి సర్వం సిద్ధం చేసిన నాన్న ప్రతాప్.. చక్రి ఏం చేయనున్నాడు?
on Jan 2, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-19 లో.. మహాని పెళ్ళికూతురిగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. తనని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ చీరలో లక్షణంగా అచ్చం మహాలక్ష్మిలాగే ఉన్నావమ్మా అని మహా వాళ్ళ అమ్మ అనగానే అవునని వాళ్ళ నాన్న ప్రతాప్ అంటాడు. అందుకే తను బాగుండాలని మంచి సంబంధం తీసుకొచ్చారు వాళ్ళ నాన్న అని మహా వాళ్ళ అమ్మ అంటుంది. అయినా ఏం లాభం తనకి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని మహా వాళ్ళ వదిన హారిక అంటుంది. అంత నిష్టూరంగా ఏం మాట్లాడకమ్మా తను అక్కడ బాగుంటుందని మహా వాళ్ళ అమ్మ అంటుంది. తను వెళ్ళిపోతే వెలితిగా ఉంటుందని బాధపడుతుంటాడు మహా వాళ్ళ నాన్న ప్రతాప్.
ఇక మహాకి సాయం చేయాలనుకుంటాడు చక్రి. ఇక కాసేపటికి మహా బయటకి వచ్చి చక్రితో మాట్లాడుతుంది.మొన్న రిజిస్టర్ మ్యారేజ్ చెడగొట్టినట్టు ఇది కూడా ఆపేస్తానని చక్రి అనగానే అది అవ్వదు.. ఆల్రెడీ ఇల్లంతా ముస్తాబు అయింది. మనం ఏం చేయలేమని మహా అంటుంది. ఇక అప్పుడే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకే అయిందని కంపెనీ నుండి కాల్ వస్తుంది కానీ తను రిజెక్ట్ చేస్తుంది. చక్రి ఎంత నచ్చజెప్పాలని చూసిన మహా వినదు.
మరోవైపు పెద్దోడు మాధవని కలవడానికి గతంలో పెళ్ళిచూపులు జరిగిన అమ్మాయి వస్తుంది. మీరు మా ఫ్యామిలీ అందరికి నచ్చారు. అయితే మా వాళ్ళు మిమ్మల్ని ఇంటి నుండి బయటకి రావాలని అంటున్నారు. మా ఇంట్లో కాదు బయట రూమ్ తీసుకొని ఉందాం.. మీరు నాకు నచ్చారని మాధవతో ఆ అమ్మాయి అంటుంది. కానీ మాధవ మాత్రం అలా రానని చెప్తాడు. నాకు మా నాన్న, తమ్ముళ్ళు, ఆ ఇల్లు ముఖ్యం.. మీరు స్పష్టంగా మాట్లాడారు.. మా గురించి అందరికి తెలుసు. నేను మేస్త్రీని.. ఒక ఇల్లు ధృడంగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి.. నా కుటుంబాన్ని నన్ను అర్థం చేసుకుంటేనే నేను పెళ్ళి చేసుకుంటానని మాధవ అంటాడు.
ఇక చక్రి కార్ లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడే కన్నా, కేశవ, మాధవ ముగ్గురు కలిసి చక్రికి కాల్ చేస్తారు. ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందా.. ఏం అయిందని అడుగుతారు. అతడిని కిడ్నాప్ చేయడం వల్ల.. ఎవరో పెళ్ళి ఆపాలని చూస్తున్నారని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి అర్థం అయింది అందుకే పెళ్ళిని మూడు రోజుల ముందుకు జరిపారని చక్రి చెప్తాడు. దాంతో ముగ్గురు డిస్సప్పాయింట్ అవుతారు. అప్పుడు అబ్బాయిని కిడ్నాప్ చేసినట్టుగా ఇప్పుడు పెళ్ళికూతురిని కిడ్నాప్ చేస్తే పెళ్ళి ఆగిపోతుంది కదా అని కన్నా, కేశవ అనగానే.. అవేం వద్దురా చక్రి, వాళ్ల మాటలు నమ్మకు.. వాళ్ళు అసలే రౌడీలలా ఉన్నారు.. వద్దని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇక చక్రి ఆలోచనల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



